Corona | యూకేలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా కొత్త వేరియంట్..!
Corona | గత మూడేళ్లుగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ (Corona Virus) మహమ్మారి ప్రస్తుతం అదుపులోనే ఉంది. భారత్ లో రోజూవారి కొత్త కేసుల్లో పెరుగుదల లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ తరుణంలో కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
Corona | గత మూడేళ్లుగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ (Corona Virus) మహమ్మారి ప్రస్తుతం అదుపులోనే ఉంది. భారత్ లో రోజూవారి కొత్త కేసుల్లో పెరుగుదల లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. దీంతో ప్రజలు సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
కొవిడ్-19 (Covid-19)లో ఒమిక్రాన్ రకం నుంచి వచ్చిన ఈజీ.5.1 (EG.5.1) అనే కొత్త వేరియంట్ బ్రిటన్ (UK)ని వణికిస్తోంది. ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతం ఆ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో దీని వాటా 14.6 శాతంగా ఉందన్నారు.
యూకేలోనే కాదు అంతర్జాతీయంగా కూడా ఈ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ వేరియంట్ తీరును గమనిస్తోంది. ప్రజలు టీకాలు వేసుకున్నప్పటికీ, ఇప్పటికే కరోనా బారినపడి కోలుకున్నప్పటికీ ఏమాత్రం అలసత్వానికి తావివ్వకూడదని డబ్ల్యూహెచ్వో స్పష్టం చేసింది. ఈజీ.5.1 వేరియంట్తో తీవ్ర ఇన్ఫెక్షన్ వస్తుందనే సూచనలు ఏమీ లేవని తెలిపింది. అయితే, అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
Also Read..
Tamannaah Bhatia | ఇప్పుడు బిజీగా ఉన్నా.. పెళ్లి గురించి ఆలోచించే తీరిక లేదంటున్న తమన్నా
Kulgam Encounter | కుల్గాంలో ఎన్కౌంటర్.. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు వీరమరణం
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- corona virus
- Covid-19
- EG.5.1
- UK
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

