Earthquake | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గుల్మార్గ్ (Gulmarg)లో భూకంపం (Earthquake) సంభవించింది. శనివారం ఉదయం 8.36 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) తెలిపింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.2గా నమోదైనట్లు పేర్కొంది. గుల్మార్గ్కు 184 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలం నుంచి 129 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం అందలేదు.
కాగా, ఈ ఏడాది జూన్ నుంచి జమ్మూ కశ్మీర్ లో 12 సార్లు భూ ప్రకంపనలు సంభవించినట్లు నివేదికలు చెబుతున్నాయి. జూన్ 13న జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో 5.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. జులై 10న అదే ప్రాంతంలో 4.9తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. ఇలా రెండు నెలల్లోనే 12 సార్లు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు.
Also Read..
Influencer | ఇన్ఫ్లుయెన్సర్ ప్రకటనతో రణరంగంగా న్యూయార్క్.. ఇంతకీ ఏమైందంటే..?
Corona | యూకేలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా కొత్త వేరియంట్..!