SC ST Atrocity | అలహాబాద్: ఒక వ్యక్తికి పుట్టుకతో వచ్చిన కులం పెండ్లితో కాని, మత మార్పిడితో కాని మారదని అలహాబాద్ హైకోర్ట్ ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎస్సీ వర్గం మహిళ ఒకరు తనను కొందరు కులం పేరుతో దూషించారని ఆరోపించారు.
అయితే ఆమె ప్రతివాదులు ఆమె ఎస్సీ కులంలో పుట్టినా అగ్ర వర్ణానికి(జాట్) చెందిన వ్యక్తిని పెండ్లి చేసుకొందని, అందువల్ల ఎస్సీ, ఎస్టీ చట్టం కింద తమపై కేసు నమోదు చేయలేరని వాదించారు. అయితే కోర్టు వారి వాదనను తోసిపుచ్చుతూ పెండ్లి, మత మార్పిడి ఒక వ్యక్తి కులాన్ని మార్చలేదని స్పష్టం చేసింది.