Ar Rahman | ‘పొన్నియిన్ సెల్వన్’ పాటపై కాపీరైట్ వివాదం… చిక్కుల్లో పడ్డ ఏఆర్ రెహమాన్
Ar Rahman | ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ రెండో భాగానికి సంగీతం అందించిన ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ‘వీరా రాజా వీర’ పాటపై కాపీరైట్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ పాట బాణీ తమ పూర్వీకులు స్వరపరిచిన శివస్తుతి నుండి తీసుకున్నదేనని ఆరోపిస్తూ ఉస్తాద్ ఫయాజ్ వసిఫుద్దీన్ కోర్టును ఆశ్రయించారు.
Ar Rahman | ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ రెండో భాగానికి సంగీతం అందించిన ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ‘వీరా రాజా వీర’ పాటపై కాపీరైట్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ పాట బాణీ తమ పూర్వీకులు స్వరపరిచిన శివస్తుతి నుండి తీసుకున్నదేనని ఆరోపిస్తూ ఉస్తాద్ ఫయాజ్ వసిఫుద్దీన్ కోర్టును ఆశ్రయించారు. కాపీరైట్ చట్టం కింద కేసు నమోదు కావడంతో ఈ వివాదం న్యాయపరమైన దిశగా సాగుతోంది.పలు దఫాల విచారణ అనంతరం గత ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీ హైకోర్టు ఈ పాట వినియోగంపై తాత్కాలిక ఆదేశాలు జారీ చేస్తూ రెహమాన్‌తో పాటు చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ రెండు కోట్ల రూపాయలను జమ చేయాలని సూచించింది.
అయితే అదే ఏడాది సెప్టెంబర్‌లో డివిజన్ బెంచ్ ఆ మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో ఫయాజ్ వసిఫుద్దీన్ తాజాగా సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా ను ఆశ్రయించారు. శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జోయ్ మాల్య బాగ్చి సభ్యులైన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా రెహమాన్ ఆ పాట డాగర్వాణి సంగీత సంప్రదాయం నుండి ప్రేరణ పొందిందని ఇప్పటికే అంగీకరించారని, అలాంటప్పుడు ఆ సంప్రదాయానికి సంబంధించిన కుటుంబ సభ్యుల పేరును ప్రస్తావించడం లో తప్పేముందని ధర్మాసనం ప్రశ్నించింది. డాగర్ కుటుంబ సభ్యులు తొలుత ఈ స్వరాన్ని ప్రదర్శించారని పేర్కొనడం సమంజసమని, ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని న్యాయమూర్తులు సూచించారు.
ఇప్పుడు రెహమాన్ తీసుకునే నిర్ణయం తుది తీర్పుపై ప్రభావం చూపదని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. ఘరానాలకు చెందిన కళాకారులు శాస్త్రీయ సంగీతాన్ని పరిరక్షించే వారని, వారికి తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి బాగ్చి అభిప్రాయపడ్డారు. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. దీంతో సంగీత రంగంలోనూ, సినీ వర్గాల్లోనూ ఈ కేసు ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

