Samantha | కష్టతర సమయాల్లో ఎలా ఉండాలో కొంతమంది సెలబ్రిటీలను చూసి నేర్చుకోవచ్చు. అలాంటి వారి జాబితాలో టాప్‌లో ఉంటుంది చెన్నై సుందరి సమంత (Samantha). సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు ఏదో ఒక పోస్ట్‌తో ఫాలోవర్లు, అభిమానుల్లో జోష్ నింపుతూంటుంది. తాజాగా ఉదయాన్నే మోటివేషన్ క్లాసులు చెబుతోంది.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. మార్నింగ్ మోటివేషన్.. మనం చేయగలం సామ్ మీ కలలను ఫాలో అవండి.. వాటికి మార్గం తెలుసు.. కొటేషన్‌ను హైలెట్ చేస్తూ.. బహుశా చూస్తూ కూర్చోవడం మంచిది. లేదంటే కాసేపు వేచి ఉండవచ్చు. బిజీ ప్రపంచంలో మీకు కావలసిందల్లా సాధారణ జీవితం. ప్రణాళిక లేకపోవడమనేది కూడా ప్రణాళికలో భాగమే కావచ్చు.. చక్కర్లు కొట్టడానికి.. హ్యాపీ హాలీడేస్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
సమంత ఓ వైపు బెడ్‌పై దుప్పటి కప్పుకొని హాయిగా నిద్రపోతున్న స్టిల్.. మరోవైపు వర్కవుట్ స్టిల్‌ను షేర్ చేయగా.. ఇప్పుడీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతేడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది సామ్. ఆ తర్వాత హిందీలో వరుణ్ ధవన్‌తో సిటడెల్ వెబ్‌సిరీస్‌లో నటించింది. ఈ ప్రాజెక్టు తర్వాత సామ్ నుంచి కొత్త సినిమా ప్రకటన రావాల్సి ఉంది.
సామ్ మార్నింగ్ మోటివేషన్ ఇలా..
Singham Again | అజయ్ దేవ్గన్ సింగం అగెయిన్ను ఇక ఫ్రీగా చూసేయొచ్చు..!
Aamir Khan | నేను రాత్రంతా తాగేవాడిని.. తన వ్యసనాల గురించి అమీర్‌ఖాన్ షాకింగ్ కామెంట్స్