BARROZ | మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohanlal) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజీ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ యాక్టర్ నటించిన మలయాళ ఫాంటసీ సినిమా బరోజ్ (BARROZ). మోహన్‌లాల్ స్వీయదర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై.. మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టుకుంది.
కాగా థియేటర్లలో స్క్రీనింగ్ అవుతున్న ఈ చిత్రం ఇక ఓటీటీలో సందడి చేసే ప్లాట్‌ఫాం అప్డేట్ కూడా వచ్చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రీమియర్ కానుంది. ఈ డిజిటల్ ప్లాట్‌ఫాం భారీ మొత్తానికి స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసినట్టు ఇన్సైడ్ టాక్. అయితే బరోజ్ ఓటీటీలోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టనుంది. అప్పటిదాకా బిగ్ స్క్రీన్స్‌పై చూసి ఎంజాయ్ చేయండి.
బరోజ్: గార్డియన్ ఆఫ్ డిగామాస్ ట్రెజర్ (Barroz: Guardian of D’Gama’s Treasure) నవల ఆధారంగా వచ్చిన ఈ చిత్రానికి జిజో పున్నూస్ కథ, స్క్రీన్ ప్లే సమకూర్చాడు. ఈ మూవీని ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరంబవూరు తెరకెక్కించారు.
ఆ డిగామా బంగ్లాలోపల ఎవరికీ కనిపించని భూతం ఉందంటూ ఓ చిన్నారి వాయిస్ ఓవర్‌తో మొదలైన ట్రైలర్లో వందల సంవత్సరాలుగా నిధులు కాపాడుకుంటూ వస్తోన్న భూతం. మిగితా వారి కోసం కార్చే కన్నీరు కంటే మహత్తరమైన నిధి ఈ లోకంలో మరేది లేదంటూ క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు మోహన్ లాల్.
బరోజ్ ట్రైలర్..
Bhool Bhulaiyaa 3 | కార్తీక్ ఆర్యన్ భూల్ భూలైయా 3 వచ్చేస్తుంది.. ఓటీటీ ప్రీమియర్ డేట్ ఫిక్స్