Bhool Bhulaiyaa 3 | బాలీవుడ్ స్టార్ యాక్టర్ కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) లీడ్ రోల్లో నటించిన చిత్రం భూల్ భూలైయా-3 (Bhool Bhulaiyaa 3). ఈ హార్రర్ కామెడీ ప్రాంఛైజీ ప్రాజెక్ట్‌కు అనీశ్ బజ్మీ దర్శకత్వం వహించాడు. విద్యాబాలన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
ప్రపంచవ్యాప్తంగా నవంబర్1న గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ రికార్డు వసూళ్లు రాబట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ రాబట్టుకున్న ఈ సినిమా ఇక ఓటీటీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది.
భూల్ భూలైయా-3 పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది. డిసెంబర్ 27న రూహ్ బాబా, మంజులిక వార్‌ను చూసేందుకు రెడీగా ఉండండి అంటూ మేకర్స్ వీడియో షేర్ చేశారు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రం ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.280 కోట్లు వసూళ్లు చేసింది. ఈ మూవీలో తృప్తి డిమ్రి ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. మాధురీ దీక్షిత్ కీలక పాత్రలో నటించింది. మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
2007లో ప్రియదర్శన్ డైరెక్షన్లో వచ్చిన ఫస్ట్ పార్ట్‌లో అక్షయ్‌కుమార్, విద్యాబాలన్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఫస్ట్ పార్టుతో పాటు సీక్వెల్ కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
@TheAaryanKartik is here with his seance of humour 😉
Watch the ultimate face off between Rooh Baba and Manjulika – Bhool Bhulaiyaa 3, out 27 December on Netflix! 🎥🍿#BhoolBhulaiyaa3OnNetflix pic.twitter.com/XZhduTQP4G— Netflix India (@NetflixIndia) December 26, 2024
Aamir Khan | నేను రాత్రంతా తాగేవాడిని.. తన వ్యసనాల గురించి అమీర్‌ఖాన్ షాకింగ్ కామెంట్స్