Hitler Re Release | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉంటాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తిరుగులేని హిట్స్ అందించాడు చిరు. ఈ స్టార్ యాక్టర్ కెరీర్లో వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ సినిమాల్లో టాప్‌లో ఉంటుంది హిట్లర్ (Hitler). ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1997 జనవరి 4న విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది.
అప్పటివరకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్‌తో ఉన్న చిరు కెరీర్‌కు ఈ చిత్రం మంచి బూస్ట్ ఇచ్చింది. కాగా ఈ ఆల్‌టైమ్ ఫేవరేట్ ప్రాజెక్ట్ రీరిలీజ్ (Hitler Re Release)కు రెడీ అవుతుందన్న వార్త అభిమానుల్లో జోష్ నింపుతోంది. అప్పట్లో 100 డేస్ థ్రియాట్రికల్ విజయవంతంగా పూర్తి చేసుకున్న హిట్లర్ చిత్రాన్ని 2025 జనవరి 1న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంకేంటి మరి మూవీ లవర్స్ న్యూఇయర్ కానుకను ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉండండి.
ఈ మూవీలో రంభ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. మమ్ముట్టి నటించిన మలయాళ క్లాసిక్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది హిట్లర్. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, దాసరి నారాయణ రావు, రామిరెడ్డి, ప్రకాశ్ రాజ్, పొన్నాంబళం, బ్రహ్మానందం, సుధాకర్‌తోపాటు పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.
Celebrate this New Year with a vintage Mega Star treat! ❤️🔥✨
Mega ⭐ @KChiruTweets‘s All-Time Blockbuster #Hitler returns to the big screen on Jan 1st, 2025! 💥#EditorMOHAN proudly brings back the blockbuster memories 💖
Re-Release by #SAICINECHITRA#ChiranjeeviHitler pic.twitter.com/cAHbKNN7H4
— Phani Kandukuri (@phanikandukuri1) December 24, 2024
Bhool Bhulaiyaa 3 | కార్తీక్ ఆర్యన్ భూల్ భూలైయా 3 వచ్చేస్తుంది.. ఓటీటీ ప్రీమియర్ డేట్ ఫిక్స్