Singham Again | రోహిత్ శెట్టి పాపులర్ కాప్ యూనివర్స్ సింగం ప్రాంచైజీకి క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. ఈ ప్రాంఛైజీలో వచ్చిన చిత్రం సింగం అగెయిన్ (Singham Again). బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ్గన్ (Ajay devgn) టైటిల్ రోల్ పోషించాడు. అక్షయ్ కుమార్, రన్వీర్ సింగ్, అర్జున్ కపూర్, టైగర్ ష్రాఫ్, కరీనాకపూర్, దీపికాపదుకొనే కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ నవంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై మిశ్రమ స్పందన రాబట్టుకుంది.
ఈ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి డిసెంబర్ 13న ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ఇప్పటివరకు రూ.499 ధరతో రెంటల్ ఫీ విధానంలో చూసే అవకాశం మాత్రమే అందుబాటులో ఉంది. కాగా ఈ సినిమాను ఉచితంగా చూడాలని ఎదురుచూసే వాళ్లకు గుడ్‌న్యూస్ బయటకు వచ్చింది. సింగం అగెయిన్ను ఇక ఫ్రీగా చూసేయొచ్చు. ఇప్పటిదాకా కొందరికి మాత్రమే అందుబాటులో ఉండగా.. ఇక అందరు సబ్స్క్రైబర్లు ఉచితంగా చూడొచ్చన్నమాట. ప్రస్తుతం హిందీ వెర్సన్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ మూవీని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, జియో స్టూడియోస్, రోహిత్ శెట్టి పిక్చర్స్, దేవ్గన్ ఫిలిమ్స్ సంయుక్తంగా తెరెక్కించాయి. సింగం అగెయిన్ మరి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
#SinghamAgain premieres tomorrow on @PrimeVideoIN #AkshayKumar𓃵 #TigerShroff #DeepikaPadukone #RanveerSingh #AjayDevgn pic.twitter.com/4j7XAhDpvB
— Akshay Kumar Fans Group (@AKFansGroup) December 26, 2024
సింగం అగెయిన్ ట్రైలర్..
Bhool Bhulaiyaa 3 | కార్తీక్ ఆర్యన్ భూల్ భూలైయా 3 వచ్చేస్తుంది.. ఓటీటీ ప్రీమియర్ డేట్ ఫిక్స్