టాలీవుడ్ (Tollywood) భామ సమంత (Samantha) విడాకుల తర్వాత స్పీడు పెంచింది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టేందుకు రెడీ అయింది. ఈ బ్యూటీ త్వరలో తన కొత్త సినిమా షూటింగ్ షురూ చేసేందుకు సిద్దమవుతోంది. నవంబర్ 3వ వారం నుంచి సమంత మొదలుపెట్టబోతున్న తెలుగు సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సారి సామ్ తన రెమ్యునరేషన్ (remuneration)ను పెంచేసిందట.
తాజా అప్డేట్ ప్రకారం కొత్త సినిమాకు సామ్ రూ.3 కోట్లు తీసుకుంటుందని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం తెలుగు సినిమా (Telugu cinema)కు అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా సామ్ నిలిచిపోనుంది. సమంత ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో నటిస్తోన్న శాకుంతలం సినిమా పూర్తి చేసింది. మరోవైపు విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో కాతువాకుల రెండు కాధల్ చిత్రంలో నటిస్తోంది. విజయ్ సేతుపతి, నయన తార కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
SS Rajamouli wish suryavanshi team | మొన్న అల్లు అర్జున్..నేడు రాజమౌళి
Samantha Super heroes | ఆ సూపర్ హీరోలకు సమంత సపోర్ట్..ఆసక్తిగా వెయిటింగ్
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?