టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మలయాళం బ్లాక్ బాస్టర్ లూసిఫర్ తెలుగు రీమేక్ (Lucifer Remake)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరణ ఇటీవలే మొదలైంది. మాతృకలో మోహన్ లాల్ పోషించిన పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నాడు. అయితే పృథ్విరాజ్ సుకుమారన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) చిరు అండ్ టీం సంప్రదించినట్టు ఓ క్రేజీ గాసిప్ బయటకు వచ్చింది.
చిరంజీవి సినిమాతో సల్మాన్ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న న్యూస్ కు కొనసాగింపుగా మరో వార్త వచ్చింది. సల్లూభాయ్ చిరు చిత్రానికి ఒకే చెప్పడమే కాకుండా..ఈ మూవీ కోసం డేట్స్ కూడా సర్దుబాటు చేశాడన్న వార్త అటు బీటౌన్ లో ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రానికి గాడ్‌ఫాదర్ టైటిల్ ను పరిశీలిస్తున్నారని టాక్. కాగా సల్మాన్ ఖాన్ మాత్రం పృథ్విరాజ్ సుకుమారన్ పాత్రలో కనిపిస్తాడా..? లేదంటే స్పెషల్ రోల్ లో మెరుస్తాడా..? అనేది తెలియాల్సి ఉంది.
ఓ వైపు టాలీవుడ్ మెగాస్టార్, మరోవైపు బాలీవుడ్ స్టార్..ఇద్దరూ ఒకేసారి సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తారని తెలియగానే పండుగ చేస్కుంటున్నారు సినీ లవర్స్. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. రాంచరణ్, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్.
ఇవికూడా చదవండి..
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!