Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
టాలీవుడ్ (Tollywood) భామ అక్కినేని సమంత (Samantha Akkineni) తొలిసారి లేడీసూపర్ స్టార్ నయనతారతో కలిసి కాతు వాకుల రెండు కాదల్ (Kaathu Vaakula Rendu Kaadhal) సినిమాలో నటిస్తోంది.

ఇటీవలే గుణ శేఖర్ డైరెక్షన్ లో చేస్తున్న శాకుంతలం షూటింగ్ పూర్తి చేసింది టాలీవుడ్ (Tollywood) భామ అక్కినేని సమంత (Samantha Akkineni). ఈ భామ తొలిసారి లేడీసూపర్ స్టార్ నయనతారతో కలిసి కాతు వాకుల రెండు కాదల్ (Kaathu Vaakula Rendu Kaadhal)సినిమాలో నటిస్తోంది. విజయ్ సేతుపతి కీ రోల్ చేస్తున్నాడు. నయన్‌తో కలిసి మొదటిసారి సినిమా చేస్తుండటంతో చాలా ఎక్జయిటింగ్ గా ఉందంటోంది సామ్.
ఇప్పటివరకు హైదరాబాద్ లో ఉన్న సామ్ పాండిచ్చేరి (Pondicherry)కి పయనమైందట. నయన్, విఘ్నేశ్ శివన్ సినిమా షూటింగ్ కోసం సామ్ పాండిచ్చేరి వెళ్లినట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్. కాగా..రానున్న 15 రోజులపాటు పాండిచ్చేరిలో షూటింగ్ షెడ్యూలు జరుగనుంది. ఈ చిత్రాన్ని నయనతార, వినీత్ కుమార్ తో కలిసి విఘ్నేశ్ శివన్ తెరకెక్కిస్తున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
తెలుగులో కూడా డబ్ కానున్న ఈ సినిమాపై సమంత చాలా ఆశలే పెట్టుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలో స్పష్టత రానుంది. సమంత ఈ ఏడాది ది ఫ్యామిలీ మ్యాన్ 2 ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాగా..మంచి సక్సెస్ అందుకుంది.
ఇవికూడా చదవండి..
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

