Sikandar | బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ (Salman Khan) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘సికందర్’ (Sikandar). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) దర్శకత్వం వహిస్తున్నాడు. నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా తెరకెక్కిస్తున్నారు. 2025 ఈద్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 26న ముంబైలో యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ షురూ కానుంది. ఈ షెడ్యూల్లో మూడు భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం. వీటిలో ఓ యాక్షన్ సీక్వెన్స్ (ఏరియల్ యాక్షన్ సీన్) గాలిలో ఉండబోతుందని.. ఈ ఎపిసోడ్‌కు భారీ మొత్తంలో ఖర్చుపెట్టిందని తెలుస్తోండగా.. సల్మాన్ ఖాన్ పూర్తిగా కొత్త గెటప్‌లో కనిపించబోతున్నారని ఇన్సైడ్ టాక్. మొత్తానికి తాజా అప్డేట్తో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
సికిందర్లో సత్యరాజ్ విలన్‌గా నటించనున్నాడు. జూన్‌లో ముంబైలోని మెహబూబ్ స్టూడియోస్‌లో ముహూర్తపు షాట్‌తో సికిందర్ షూటింగ్ షురూ అవగా.. షూట్ స్టిల్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. మొదటి షెడ్యూల్లో భాగంగా సల్మాన్ ఖాన్ అండ్ టీంపై ఏరియల్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించినట్టు కూడా వార్తలు తెరపైకి వచ్చాయి. సముద్ర మట్టానికి 33 వేల అడుగుల ఎత్తులో ఎయిర్‌క్రాఫ్ట్‌లో సల్మాన్ ఖాన్‌పై వచ్చే సన్నివేశాలుండబోతున్నాయని బీటౌన్ సర్కిల్ టాక్.
Toofan | ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ తుఫాన్.. ఏ ప్లాట్ఫాంలోనంటే..?
Raayan | రాయన్ సక్సెస్ ట్రీట్.. ధనుష్‌కు ఒకేసారి రెండు చెక్కులు