salman khan rents out | బాలీవుడ్ హీరోలు చాలామందికి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. వాళ్లందరూ ఎక్కువగా అపార్ట్మెంట్స్, ఇండ్లు కొనుక్కొని స్థిరాస్తులు బాగా జమ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా ముంబైలో ఖరీదైనా ఏరియాల్లో అపార్ట్మెంట్స్ తీసుకుని వాటిని అద్దెకు ఇస్తుంటారు బాలీవుడ్ నటులు. అందులో సల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడు. తాజాగా ఆయన కూడా తన ఫ్లాట్‌ను అద్దెకు ఇచ్చాడు. కండల వీరుడికి ముంబైలోని చాలా ఏరియాల్లో సొంత ఇండ్లు ఉన్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఖరీదైన బంద్రా వెస్ట్‌లోని శివ్ ఆస్థాన్ హైట్స్ ( Shiv asthan heights ) లో ఓ అపార్ట్మెంట్ ఉంది. 14వ ఫ్లోర్లో 758 స్వ్కేర్ ఫీట్ ఉన్న ఈ ఫ్లాట్‌ని తాజాగా రెంటుకు ఇచ్చాడు సల్మాన్. దీనికి నెల అద్దె లక్ష రూపాయలు.
మరోవైపు సల్మాన్ ఖాన్ కూడా బంద్రాలోనే గెలాక్సీ అపార్ట్మెంట్ ( Galaxy apartmentలో నివసిస్తున్నాడు. అది చాలా చిన్నగా ఉంటుంది. అయినా కూడా అక్కడే ఉంటున్నాడు సల్లూ భాయ్. ఇక శివ్ ఆస్థాన్ హైట్స్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ రెంట్‌కు సంబంధించి ఓ అగ్రిమెంట్ కూడా ఉంది. ఒకసారి రెంటుకు తీసుకున్న తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు ఖాళీ చేయడానికి ఉండదు. ఒకవేళ ఖాళీ చేసినా కూడా అగ్రిమెంట్ ప్రకారం ముందుగానే అదే చెల్లించాలి. అలా ఈ ఇంటిని 33 నెలలకు రెంట్‌కు ఇస్తూ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు సల్మాన్ ఖాన్. ఆ రెంటుకి తీసుకున్న వ్యక్తి సెక్యూరిటీ డిపాజిట్‌గా 2.5 లక్షలు చెల్లించాడు.
ఇది మాత్రమే కాకుండా ఈ స్టార్ హీరోకి ముంబైలో మరికొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇంతకు ముందే ఈ మక్బా హైట్స్‌లో ఉన్న ఓ డూప్లెక్స్ ప్లాట్‌ని 8.5 లక్షలకు అద్దెకు ఇచ్చాడు కండల వీరుడు. నెలకు సల్మాన్ ఖాన్‌కు కోట్లల్లో అద్దెలు వస్తాయని బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెబుతుంటారు. అయితే ఇంత డబ్బు, ఆస్తులు ఉన్న సల్లూ భాయ్ మాత్రం 1 బీహెచ్‌కేలో ఉంటున్నాడని ‘అంతిమ్’ సినిమా డైరెక్టర్ మహేశ్ మజ్రేకర్ తెలిపాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బాయ్ ఫ్రెండ్స్ నుండి కోట్ల రూపాయల బహుమతులు అందుకున్న కత్రినా..!
చిరంజీవి గాడ్‌ఫాదర్‌లో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడా? క్లారిటీ ఇచ్చిన సల్లూ భాయ్
Kriti Rents Amitabh Apartment | అమితాబ్ బచ్చన్ ప్లాట్‌కు కృతిసనన్ ఇచ్చే అద్దె తెలిస్తే షాకే..!
Katrina Kaif: పెళ్లి తర్వాత డీపీ మార్చిన కత్రినా.. ఏ ఫొటో పెట్టిందో తెలుసా?
Kiara Advani: కాస్ట్లీ కార్లని కొనుగోలు చేస్తున్న అందాల ముద్దుగుమ్మలు.. ఏంటి కథ?