Kayadu Lohar | ‘ది ప్యారడైజ్’లో కయాదు లోహర్ పాత్రపై విమర్శలు.. శ్రీకాంత్ ఓదెలకి నెటిజన్ల ప్రశ్నలు
Kayadu Lohar | నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’కు విడుదల తర్వాత మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా కథ, నాని నటన, యాక్షన్ సన్నివేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ఈ చిత్రంలో కయాదు లోహర్ పోషించిన సుబ్బు పాత్ర మాత్రం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. ముఖ్యంగా ఆ పాత్రను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన విధానంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Kayadu Lohar | నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’కు విడుదల తర్వాత మిశ్రమ స్పందన వస్తోంది. సినిమా కథ, నాని నటన, యాక్షన్ సన్నివేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. ఈ చిత్రంలో కయాదు లోహర్ పోషించిన సుబ్బు పాత్ర మాత్రం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. ముఖ్యంగా ఆ పాత్రను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన విధానంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో సుబ్బు పాత్రకు సినీ నటి కావాలనే కోరిక ఉంటుంది. తల్లి వద్దని వారించినా మద్రాస్ వెళ్లి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది. అయితే అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతుంది. అదే సమయంలో తన తండ్రి చేసిన అప్పుల కారణంగా కుటుంబం ఎదుర్కొంటున్న అవమానాలను చూస్తుంది. ఎలాగైనా ఆ అప్పులు తీర్చాలని నిర్ణయించుకున్న సుబ్బు.. డబ్బు కోసం బీ గ్రేడ్ చిత్రాల్లో నటించడం ప్రారంభిస్తుంది.
ఇక్కడే ‘ది ప్యారడైజ్’లోని కొన్ని సన్నివేశాలపై ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సుబ్బు నటించే బీ గ్రేడ్ చిత్రాలకు ‘చుక్క చిత్రాలు’ అనే పేరు పెట్టడం, వాటిని ప్రదర్శించే సన్నివేశాల్లో హీరోయిన్ పాత్రను చూపించిన తీరు అవసరానికి మించి గ్లామర్‌ను ప్రధానంగా చూపించిందని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. కథలో ఆ పాత్ర ఎదుర్కొంటున్న బాధ, పరిస్థితుల తీవ్రత ప్రేక్షకులకు బలంగా కనెక్ట్ కావాల్సిన చోట.. కొన్ని సన్నివేశాలు వేరే విధంగా స్పందన తెచ్చుకున్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరోవైపు సుబ్బు నడుముపై ఉండే సీతాకోకచిలుక టాటూ కూడా కథలో కీలకంగా ఉపయోగించారు. బీ గ్రేడ్ చిత్రాల్లో ఆమె ముఖాన్ని చూపించకుండా ఆ టాటూ ద్వారా గుర్తుపట్టేలా సన్నివేశాలను రూపొందించారు. అయితే ఆ విషయాన్ని హీరో తెలుసుకున్న తర్వాత వచ్చే సన్నివేశంలో నాని చెప్పే కొన్ని సంభాషణలపైనా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా మహిళలను అవమానించేలా అనిపించే పదజాలాన్ని ఉపయోగించడంపై కొందరు ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి సుబ్బు పాత్ర వెనుక ఉన్న ఉద్దేశం భావోద్వేగంగా ప్రేక్షకులను కదిలించడమే అయి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. కుటుంబ అప్పులు తీర్చడానికి ఒక యువతి తనకు ఇష్టం లేని మార్గంలోకి వెళ్లాల్సి రావడం, ఆ తర్వాత ఆ విషయం హీరోకు తెలియడం వంటి అంశాలతో బలమైన భావోద్వేగాన్ని పండించాలని దర్శకుడు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. అయితే ఆ సన్నివేశాల చిత్రీకరణ కారణంగా ఆశించిన భావోద్వేగం కంటే భిన్నమైన స్పందన వచ్చిందని కొందరు ప్రేక్షకులు అంటున్నారు. సోషల్ మీడియాలో కొంతమంది కయాదు లోహర్ సన్నివేశాలనే సినిమాకు సంబంధించిన చర్చలో ప్రధాన అంశంగా మార్చుకుని ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆ పాత్రను విమర్శించాల్సిన అవసరం లేదని, పాత్రను ఎలా రాశారు, ఎలా చూపించారు అనే అంశంపైనే చర్చ జరగాలని అంటున్నారు. అంటే.. విమర్శల ప్రధాన కేంద్రం కయాదు లోహర్ కాదు, ఆమె పాత్రను తెరపై ఆవిష్కరించిన విధానమే అన్నది వారి అభిప్రాయం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

