Nepal | ఉప్పొంగుతున్న బాగమతి నది.. పొంచి ఉన్న వరద ముప్పు.. నేపాల్‌లో మరోసారి హై అలర్ట్
Nepal : ఇటీవలే భారీ వరదలకు అతలాకుతలమైన నేపాల్ మరోసారి ప్రమాదం అంచున ఉంది. స్థానిక బాగమతి నది ఉప్పొంగుతుండటంతో వరద ముంచుకొస్తుందేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Nepal : ఇటీవలే భారీ వరదలకు అతలాకుతలమైన నేపాల్ మరోసారి ప్రమాదం అంచున ఉంది. స్థానిక బాగమతి నది ఉప్పొంగుతుండటంతో వరద ముంచుకొస్తుందేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నేపాల్‌లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక నదుల్లో నీటి ప్రవాహం భారీగా పెరిగింది. ముఖ్యంగా బాగమతి నదికి భారీ వరద నీరు చేరడంతో ఉప్పొంగి ప్రవహిస్తోంది.
నదీ తీరంలోని అనేక ఇండ్లను తాకుతూ నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇంకొంచెం నీటి ప్రవాహం పెరిగితే, ఒడ్డున ఉన్న ప్రాంతాలను వరద ముంచెత్తే అవకాశం ఉంది. అందుకే, ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. శుక్రవారం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. భారీ వర్షాలకు కొండ చరియలు కూడా విరిగిపడే అవకాశం ఉంది. రాజధాని ఖాట్మండ్, ఇతర ప్రాంతాలను కలిపే రహదారులపై నీరు ప్రవహిస్తోంది. ఈ ప్రాంతాల్లోనే వరదలు, కొండచరియల ముప్పు పొంచి ఉంది. పృథ్వి హైవే, బీపీ హైవే, కంటి లోక్‌పాత్ హైవేలు అనేక చోట్ల నీట మునిగాయి. రోడ్లపై వరద నీరు చేరడంతోపాటు, కొన్ని చోట్ల కొండ చరియలు విరిగి పడటంతో రహదారులు స్తంభించాయి.
దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఒకపక్క బాగమతి నది ఉప్పొంగుతుంటే.. మరోపక్క భారీ నుంచి అతి భారీవర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, రోషి నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో అనేక చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్‌ను మళ్లించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సెప్టెంర్ 25-27 వరకు భారీ వర్షాలు పడుతాయని, వరదలు, కొండ చరియలు విరిగిపడటానికి అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

