Kriti Rents Amitabh Apartment | అమితాబ్ బచ్చన్ ప్లాట్‌కు కృతిసనన్ ఇచ్చే అద్దె తెలిస్తే షాకే..!
బాలీవుడ్ (Bollywood) నటి కృతిసనన్ (Kriti Sanon), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ప్లాట్‌కు కడుతున్న కిరాయి ఇపుడు బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

బాలీవుడ్ (Bollywood) సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తన ప్లాట్‌ను అద్దెక్కిచ్చారు. ఇంతకీ బిగ్ బీ ప్లాట్‌లో అద్దెకుంటున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా..? బాలీవుడ్ నటి కృతిసనన్ (Kriti Sanon). ఈ బ్యూటీ బిగ్ బీ ప్లాట్‌కు కడుతున్న కిరాయి ఇపుడు బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. డూప్లెక్స్ అపార్టుమెంట్‌కు కృతిసనన్ నెలకు రూ.10 లక్షలు అద్దె చెల్లిస్తుందట. నాలుగు కార్లు పార్కు చేసుకునే సౌకర్యం ఉన్న ఈ అపార్ట్మెంట్ కోసం కృతిసనన్ రూ.60 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించినట్టు టాక్.
బీటౌన్ సమాచారం ప్రకారం నవంబర్ 12న లైసెన్స్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అక్టోబర్ 16 2021 నుంచి అక్టోబర్ 15 2023 వరకు రెండు సంవత్సరాల వరకు లీజు ఒప్పందం రాసుకున్నారని ఇన్సైడ్ టాక్. అంధేరి వెస్ట్ లోఖండ్వాలా రోడ్ (Lokhandwala Road) సమీపంలోని అట్లాంటిస్ బిల్డింగ్ (Altantis building) లో 27, 28 ఫ్లోర్లను కృతిసనన్ రెంట్‌కు తీసుకుందని టాక్. అమితాబ్ బచ్చన్ 2020 డిసెంబర్లో 5,184 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్టుమెంట్ ఫ్లోర్లను రూ. 31 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు.
మొత్తానికి అమితాబ్ బచ్చన్ అపార్టుమెంట్‌కు కృతిసనన్ చెల్లిస్తున్న అద్దె ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర, గుడ్ బై, ప్రాజెక్టు కే చిత్రాలతోపాటు పలు సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు కృతిసనన్ బచ్చన్‌పాండే, ఆదిపురుష్ సినిమాలతోపాటు మరో మూడు చిత్రాల్లో నటిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Pragya Jaiswal | ‘అఖండ’తో ఎప్పుడూ లేని అనుభూతి : ప్రగ్యాజైశ్వాల్
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ
Suma: జయమ్మ పంచాయితీ టీజర్లో పంచ్‌లు బాగానే ఉన్నాయిగా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

