బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) డిసెంబర్ 27న ముంబైకి సమీపంలోని తన ఫాంహౌజ్‌లో 56వ పుట్టినరోజు వేడుకల (Salman 56th birthday ) ను గ్రాండ్‌గా జరుపుకున్న సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులు, ఇండస్ట్రీ స్నేహితుల సమక్షంలో పుట్టినరోజు జరుపుకున్నాడు. బర్త్ డేన సల్మాన్ కు కోస్టార్లు, స్నేహితులు ఖరీదైన కానుకల (Birthday Gifts) ను అందించారన్న వార్త ఇపుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కత్రినాకైఫ్, శిల్పాశెట్టి, సంజయ్ దత్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తోపాటు ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని బహుమతిగా అందజేశారు.
తాజాగా రౌండప్ చేస్తున్న సమాచారం ప్రకారం కత్రినాకైఫ్ ( Katrina Kaif) రూ.2-3 లక్షల విలువైన గోల్డ్ బ్రాస్ లెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిందట. జాక్వెలిన్ ఫెర్నాండేజ్రూ.10-12 లక్షల విలువైన చోపార్డ్ బ్రాండ్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చిందట. అనిల్ కపూర్ రూ.27-29 లక్షల ఖరీదైన లెదర్ జాకెట్, శిల్పాశెట్టి రూ.16-17 లక్షల డైమండ్ బ్రాస్ లెట్‌ను కానుకగా ఇచ్చినట్టు బీటౌన్ సర్కిల్ టాక్. ఇవే కాకుండా కుటుంబసభ్యులు కూడా సల్మాన్‌ఖాన్‌కు ఖరీదైన కానుకలు ఇక సల్మాన్ కు సోదరి అర్పితాఖాన్ రూ.15-17 లక్షల రోలెక్స్ వాచ్‌ను బర్త్ డే గిఫ్ట్‌గా అందించింది.
సల్మాన్ సోదరులు సోహైల్ ఖాన్, అర్బాజ్ ఖాన్ రూ.23-25 లక్షల విలువైన బీఎండబ్ల్యూ 1000 RR, 2-3 కోట్ల Audi RS Q8 ను బహుమతిగా అందించగా..అర్పితాఖాన్ భర్త ఆయుష్ శర్మనేమో రూ.75 వేలు విలువైన బంగారు గొలుసు అందించాడు. సల్మాన్‌ఖాన్ కు వచ్చిన బహుమతులు అత్యంత ఖరీదైన గిఫ్ట్ ఎవరిచ్చారో తెలుసా..? సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్. జుహూలో రూ.12-13 కోట్ల విలువైన అపార్టుమెంట్ణు గిఫ్ట్ ఇచ్చినట్టు ఇన్ సైడ్ టాక్.