Saif Ali Khan | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఆసుపత్రి నుంచి ఇవాళ డిశ్చార్జ్ కానున్నారు (discharged from hospital). ఈ విషయాన్ని లీలావతి ఆసుపత్రి (Lilavati Hospital) వైద్యులు ధ్రువీకరించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 మధ్య సైఫ్‌ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. డిశ్చార్జ్‌కు సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తి చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
కాగా, ఈనెల 16న సైఫ్ ఇంటికి చోరీకి వెళ్లిన దుండగులు ఆయనపై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆరుసార్లు సైఫ్‌ను దుండగుడు కత్తితో పొడిచాడు. గురువారం తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే సైఫ్‌ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ నటుడికి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.
మరోవైపు సైఫ్‌పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ (Mohammad Shariful Islam Shahzad)ను శనివారం అర్థరాత్రి 2.50గంటలకు థానేలోని హిరానంది ప్రాంతంలో అరెస్టు చేసి విచారిస్తున్నారు. విచారణలో భాగంగా క్రైమ్‌సీన్ రీక్రియేషన్ కోసం నిందితుడిని సైఫ్ ఇంటి వద్దకు తీసుకెళ్లారు. నిందితుడి వేలిముద్రలను కూడా తీసుకున్నారు.
Also Read..
“Saif Ali Khan | సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు.. కోర్టులో ఇద్దరు లాయర్ల గొడవ.. జడ్జి ఏం చేశారంటే?”
“సైఫ్‌పై దాడి కేసులో బంగ్లా దేశీయుడి అరెస్ట్”
“Shatrughan Sinha | ఏఐతో సైఫ్ అలీఖాన్‌పై పోస్ట్.. విమర్శలు ఎదుర్కొంటున్న ఎంపీ శత్రుఘ్న సిన్హా”
“Saif Ali Khan | సైఫ్ అలీఖాన్‌పై దాడి.. ముంబై పోలీసుల అదుపులో అసలు నిందితుడు”