ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడిచేసిన కేసులో నిందితుడిని ముంబై పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితుడు బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్ (30)గా గుర్తించామని ఒక పోలీస్ ఉన్నత అధికారి చెప్పారు.
థాణేలో అటవీ ప్రాంతంలో ఉన్న ఒక లేబర్ క్యాంప్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపర్చగా ఐదు రోజుల పోలీస్ కస్టడీకి పంపిందని, ఈ దాడి వెనుక అంతర్జాతీయంగా ఏదన్నా కుట్ర ఉందా అన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి ఐదు నెలల క్రితం భారత్‌కు అక్రమంగా వచ్చిన నిందితుడు తన పేరును విజయ్ దాస్‌గా మార్చుకున్నాడు. తర్వాత హౌస్ కీపింగ్ సహా చిన్నచిన్న పనులు చేసేవాడు. ఆ ఇల్లు నటుడు సైఫ్ అలీఖాన్‌దని తనకు తెలియదని, కేవలం చోరీ కోసమే అందులో ప్రవేశించినట్టు నిందితుడు తెలియజేసినట్టు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.