ముంబై: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై (Saif Ali Khan) కత్తితో దాడి చేసిన అసలు నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత థానేలో నిందితుడు విజయ్ దాస్‌ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. అతని అసలు పేరు మహమ్మద్ అలియాస్ బీజే అని తెలిపారు. ముంబైలోని పబ్‌లో విజయ్ దాసే అనే పేరుతో పనిచేస్తున్నాడని చెప్పారు. ఆదివారం తెల్లవారుజామున థానేలోని హరినందాని ఎస్టేట్ సమీపంలోని మెట్రో నిర్మాణం చేస్తున్న కార్మికుల క్యాంపులో అతడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ముంబై డీసీపీ ఆఫీస్‌లో మీడియా సమావేశం నిర్వహిస్తామని, ఈ సందర్భంగా నిందిడిని ప్రవేశపెడమాని తెలిపారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లో అరెస్టు చేసిన అనుమానితుడు కైలాశ్ నిందితుడు కాదని పేర్కొన్నారు.
కాగా, సైఫ్ నివాసంలో చొరబడి అతనిపై దాడి చేసింది తాననేని అంగీకరించాడని పేర్కొన్నారు. ప్రస్తుతం అతడిని బాంద్రాకు తరలిస్తున్నామని, అనంతరం విచారిస్తామని చెప్పారు. ఆదివారం ఉదయం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోరుతామని వెల్లడించారు. అతనివద్ద భారతీయుడిగా ఉన ధృవీకరణ పత్రం నకిలీదని వెల్లడించారు. దీంతో అతడు భారతీయుడా లేదా బంగ్లాదేశీయా అని ఆరాతీస్తున్నారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ఆయన భార్య కరీనా కపూర్ శనివారం పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఆ రోజు నిందితుడు చాలా దూకుడుగా ఉన్నాడని, అయితే అక్కడ నగలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని అతడు ముట్టుకోలేదని ఆమె తెలిపారు. మరోవైపు ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేసినట్టు పోలీసులు అధికారికంగా ప్రకటించ లేదు. అయితే దాడికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో శనివారం 31 ఏండ్ల ఆకాశ్ కైలాష్ కన్నోజియాను ఆర్పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అయితే అతడు సైఫ్ ఇంటి సీసీ కెమెరాల్లో కన్పించిన నిందితుడా లేక మరో వ్యక్తా అన్న విషయాన్ని నిర్ధారించ లేదు. సైఫ్ మెడికల్ బిల్లు ఇప్పటివరకు సుమారు 40 లక్షలు అయ్యింది. అందులో 25 లక్షల రూపాయలు క్లెయిమ్‌ను ఆమోదించినట్టు వైద్య ఆరోగ్య బీమా సంస్థ నివా బుపా తెలిపింది.