సినీ ఇండస్ట్రీ (Cinema Industry)లో హీరోహీరోయిన్లు సాధారణంగానే ఒకరిపై ఒకరు సందర్భాన్ని బట్టి ప్రశంసలు కురిపిస్తుంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తమ కోస్టార్ల టాలెంట్‌ను గుర్తించి.. వారిని ప్రోత్సహిస్తుంటారు. బాలీవుడ్ (Bollywood) హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) తన సహనటుడిని ప్రశంసలతో ముంచెత్తాడు. ఇంతకీ ఆ కోస్టార్ ఎవరనుకుంటున్నారా..? బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ (Prabhas). మీడియా పోర్టల్‌తో చిట్‌చాట్‌లో సైఫ్ అలీఖాన్ మాట్లాడుతూ..ప్రభాస్ ఎంతో డెడికేషన్ కలిగిన నటుడు.
సిల్వర్ స్క్రీన్‌పై ప్రభాస్ ప్రజెంటేషన్ అద్బుతంగా ఉంటుంది. అతనెందుకు పెద్ద సూపర్ స్టార్ అయ్యాడో నాకు అర్థమైంది..అంటూ చెప్పుకొచ్చాడు. తమ అభిమాన హీరోను బాలీవుడ్ స్టార్ యాక్టర్లలో ఒకడైన సైఫ్ అలీఖాన్ పొగడ్తలతో ముంచెత్తేసరికి ఆనందంలో మునిగిపోతున్నారు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్. ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆది పురుష్ (Adipurush) చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా.. డెమన్ కింగ్ లంకేశ్ పాత్రలో నటిస్తున్నాడు సైఫ్ అలీఖాన్.
ఈ ప్రాజెక్టు ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నట్టు బీటౌన్ వర్గాల సమాచారం. ఆదిపురుష్ షూటింగ్‌ను పూర్తి చేసిన ప్రభాస్ ప్రస్తుతం మరో పాన్ ఇండియా ప్రాజెక్టు సలార్‌పై ఫోకస్ పెట్టాడు. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది సలార్. కోలీవుడ్ భామ శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ప్రభాస్ మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు కే కూడా చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్లు దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇది కూడా చూడండి
Shruti Haasan | సలార్ డైరెక్టర్ తో శృతిహాసన్ ఫన్ టైం..వీడియో వైరల్
Mahesh Babu black Royal look | న్యూ స్టైలిష్ లుక్‌లో మహేశ్‌బాబు..ఫొటోషూట్ అదిరింది
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్‌కపూర్