Satya | సాయిధరమ్ తేజ్ (Sai Durga Tej), స్వాతిరెడ్డి (Swathi Reddy) కాంబోలో తెరకెక్కిన మ్యూజికల్ వీడియో సత్య (Satya). The Soul Of Satya టైటిల్‌తో విడుదల చేసిన వీడియో సాంగ్ (షార్ట్ ఫిల్మ్)కు మంచి స్పందన వచ్చింది. ఈ పాటను శృతిరంజని రాసి స్వయంగా కంపోజ్ చేస్తూ పాడటం విశేషం.
మొట్ట మొదటిసారిగా ప్రపంచం సత్యను వీక్షించి.. విలువైన ఓటుతో మమ్మల్ని ఆశీర్వదించింది. మా మనస్సులకు హృద్యమైన ఈ కథ ఫిల్మ్‌ఫేర్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో పీపుల్స్ ఛాయిస్ అవార్డు కేటగిరీలో పోటీ పడుతోంది. గెలిచేందుకు మాకు మీ మద్దతు కావాలి. ఈ లింక్‌ని క్లిక్ చేయండి.. సినిమా చూసి.. దయచేసి సత్యకి ఓటు వేయండి. నా బెస్ట్ ఫ్రెండ్ నవీన్ విజయ కృష్ణ దర్శకత్వం వహించాడు.. అంటూ ట్వీట్ చేశాడు.
దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి.. సరైన గుర్తింపునకు నోచుకోని రియల్ హీరోలకు నివాళిగా ఈ మ్యూజిక్ వీడియోను రూపొందించారు. దేశం కోసం తమ ప్రేమను త్యాగం చేసి.. దేశానికి ఎంతోమంది యుద్దవీరులను అందించిన మహిళల త్యాగాలను స్మరించుకుంటూ రూపొందించిన ఈ మ్యూజిక్ వీడియోకు ఎలాంటి సపోర్ట్ వస్తుందో చూడాలి మరి.
ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్పటికే ఫ్రాన్స్‌లోని ప్రతిష్టాత్మకమైన టౌలౌజ్ షార్ట్స్ ఫెస్ట్‌లో 8 అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సౌండ్ డిజైన్, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ నిర్మాత, ఉత్తమ నూతన దర్శకుడు, ఉత్తమ ఇండీ షార్ట్ విభాగాల్లో ఈ సినిమాకు అవార్డులు వచ్చాయి.
For the first time ever, the world can watch Satya and bless us with your valuable vote 🇮🇳❤
This story, so dear to our hearts, is competing for the People’s Choice Award at the Filmfare Short Film Awards 2024. We need your support to win—click the link, watch the film, and… pic.twitter.com/vrG0Ddsivn
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 24, 2024
The Soul Of Satya ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
Vijay Antony | విలన్‌గా విజయ్ ఆంటోనీ మేనల్లుడి గ్రాండ్ ఎంట్రీ.. గగన మార్గన్ పోస్టర్లు వైరల్
Kissik | అల్లు అర్జున్, శ్రీలీల స్టైలిష్ డ్యాన్స్.. కిస్సిక్ ఫుల్ సాంగ్ లాంచ్ టైం ఫిక్స్
RC16 | రాంచరణ్ ఆర్సీ16 షూట్ టైం.. మైసూర్ టెంపుల్ ముందు బుచ్చి బాబు సాన