Sai dharam tej | సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, దేవ్ కట్టా కాంబినేషన్లో రూపొందుతోన్న పొలిటికల్ థ్రిల్లర్ రిపబ్లిక్. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. దీనికి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. దీనికి సంబంధించిన పోస్టర్ విడుదల అయింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 1న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఈ మేరకు రిలీజ్ డేట్ ఉన్న పోస్టర్ విడుదల చేశారు.
రిపబ్లిక్ ( Republic ) పోస్టర్లో టోపీ పెట్టున్న సాయి ధరమ్ తేజ్ చాలా ఇన్టెన్స్ లుక్‌తో కనిపిస్తున్నాడు. సినిమాలో ఈయన IAS ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఇప్పటివరకు చేయనటువంటి ఓ సరికొత్త పాత్రలో సాయి ధరమ్ తేజ్ కనిపిస్తున్నాడు. ఇందులో సామాజిక అంశాన్ని హైలైట్‌గా తీసుకొని కథ రాసుకున్నాడు దర్శకుడు దేవా కట్టా. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ కథ సాగుతోంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్గా నటిస్తుండగా.. విలక్షణ నటులు జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Much Awaited #Republic is Censored with 𝕌/𝔸. Releasing in Theaters WORLDWIDE on October 1st 💥#RepublicFromOct1st@IamSaiDharamTej @aishu_dil @devakatta @meramyakrishnan @IamJagguBhai #ManiSharma @bkrsatish @JBEnt_Offl @ZeeStudios_ @ZeeMusicCompany @JBhagavan1 @j_pullarao pic.twitter.com/FlWkqTGJW0
— BA Raju's Team (@baraju_SuperHit) September 18, 2021
ఇప్పటి వరకు విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, కాలేజ్ సాంగ్‌తో పాటు జోర్ సే.. సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్, దేవ్ కట్టా మార్క్ టేకింగ్ డైలాగ్స్‌తో సినిమాపై ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 1న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఒకవైపు సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్లో ఉండగా.. మరోవైపు ఆయన సినిమా థియేటర్లలో విడుదల అవుతుండటం ఒకింత ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Rashmika Mandanna : రహస్యాల్ని బయటపెట్టను!
Bigg Boss: కాజల్‌కి ఫుల్ క్లాస్ పీకిన ప్రియ..ఎందుకో తెలుసా?
Bigg Boss: ఈ వారం బెస్ట్, వరస్ట్ పర్ఫార్మర్స్ ఎవరో తెలుసా?
Idol Winner: ఇద్దరు భార్యలు,ఇద్దరు గార్ల్ ఫ్రెండ్స్‌ని సెట్ చేసుకున్న ఐడల్ విన్నర్
తమన్నాని అలా చూసి ఏడ్చేసిన దర్శకుడి కూతురు..!