టాలీవుడ్ (Tollywood) హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) 2021 సెప్టెంబర్‌లో రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత కెమెరాకు దూరమైన విషయం తెలిసిందే. ఈ యువ హీరో చాలా రోజుల తర్వాత మేకప్ వేసుకున్నాడు. కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ ఇవాళ మొదలైంది. సెట్స్ కు వచ్చిన సాయిధరమ్ తేజ్‌కు చిత్రయూనిట్ గ్రాండ్‌గా వెల్ కమ్ చెప్పింది. సెట్స్ లో మొదటి రోజు సాయిధరమ్ తేజ్ సందడికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
స్టార్ డైరెక్టర్ సుకుమార్ హీరో సాయి ధరమ్ తేజ్‌కు పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికాడు. సాయిధరమ్ తేజ్ 15వ (SDT 15) ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర్ సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి శామ్‌దత్ సైనుదీన్ కెమెరామెన్.
ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది. స్పోర్ట్స్ బైకు (Sports Bike)పై నుంచి కింద పడ్డ సాయిధరమ్ తేజ్‌కు డాక్టర్లు కాలర్ బోన్ సర్జరీని చేశారు. డాక్టర్ల సూచనల మేరకు థెరపీ చేయించుకుని, విశ్రాంతి తీసుకున్నాడు. పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ సెట్స్ లో జాయిన్ అయి అభిమానుల్లో జోష్ నింపాడు సాయిధరమ్.