స్వరూప్ ఆర్ఎస్జే (Swaroop RSJ ) డైరెక్షన్ (డెబ్యూట్ మూవీ)లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో సోలో హీరోగా మంచి బ్రేక్ అందుకున్నాడు యువ నటుడు నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty). ఆ తర్వాత జాతిరత్నాలు సినిమాతో హీరోగా తనలోని కామెడీ యాంగిల్‌ను కూడా అందరికీ పరిచయం చేశాడు. ఈ యువ హీరో ఇపుడు తనకు మంచి సక్సెస్ అందించిన డైరెక్టర్ కోసం వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఇంతకీ ఏ సినిమా కోసం అనే కదా మీ డౌటు.
స్వరూప్ ఆర్ఎస్జే డైరెక్షన్లో వస్తున్న తాజా చిత్రం మిషన్ ఇంపాజిబుల్ (Mishan Impossible). తాప్సీ పన్ను (Taapsee Pannu) మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న ఈ చిత్రంలో ముగ్గురు చైల్డ్ ఆర్టిస్టులు కీ రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు నవీన్ పొలిశెట్టి. డబ్బింగ్ థియేటర్లలో నవీన్ పొలిశెట్టి వాయిస్ ఓవర్ అందిస్తున్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
జాతిరత్నాలు హీరో వాయిస్ ఓవర్ అందించడం మిషన్ ఇంపాజిబుల్ టీంకు ఖచ్చితంగా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నిరంజన్ రెడ్డి, అన్వేశ్ రెడ్డి సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మరో రెండు రోజుల్లో అంటే ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.