టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తోన్న హిందీ సినిమా బ్రహ్మాస్త్ర (Brahmastra). బాలీవుడ్ (Bollywood)లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ యాక్టర్లు రణ్‌బీర్ కపూర్, అలియాభట్ (Alia Bhatt), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), డింపుల్ కపాడియా, మౌనీరాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది.
బ్రహ్మాస్త్ర నేటితో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. బ్రహ్మాస్త్ర పార్టు 1 : శివ చిత్రీకరణ పూర్తయింది. చిన్న వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ 09.09.2022న థియేటర్లలో కలుద్దాం అంటూ క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. సూపర్ హీరో మూవీ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర మూవీని హిందీతోపాటు తెలుగు, తమిళం, బెంగాలీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు.
సుమారు రూ.150 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రీతమ్ మ్యూజిక్ డైరెక్టర్.