Nazriya Fahadh | లీలా థామస్, వివేక్‌ను చాలా మిస్సవుతున్నా..నాని భామ ఎమోషనల్ పోస్ట్
కోలీవుడ్ భామ నజ్రియా ఫహద్ (Nazriya Fahadh) ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తున్న తొలి తెలుగు చిత్రం అంటే సుందరానికి (Ante Sundaraniki) పోషిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెరపైకి వచ్చింది.
నాని (Nani) ప్రస్తుతం అంటే సుందరానికి (Ante Sundaraniki) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వం వహిస్తున్నాడు. కోలీవుడ్ భామ నజ్రియా ఫహద్ (Nazriya Fahadh) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెరపైకి వచ్చింది.
తన ఎక్స్ప్రెషన్స్ తో సోష|ల్మీడియా స్టార్‌గా మంచి క్రేజ్ సంపాదించిన నజ్రియా ఫహద్ తొలిసారి ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరిస్తున్న విషయం తెలిసిందే. నాని చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలను నజ్రియా పూర్తి చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్‌మీడియాలో ఒక ఎమోషనల్ నోట్ పెట్టింది. అంటే సుందరానికి మేకింగ్ టైంలో ఎదుర్కొన్న అనుభవాలను సందేశం రూపంలో అందరితో షేర్ చేసుకుంది.
డైరెక్టర్ తో తన బాండింగ్ గురించి చెప్పుకొస్తూ..నేను ఈ సినిమా ప్రయాణం అంతా..ప్రతీ రోజు నా వర్కింగ్ డేను ప్రేమించా. గతేడాది నుంచి ఇది నాకు చాలా సుదీర్ఘ ప్రయాణం. మేం చాలా దూరం నుంచి వచ్చాం. ప్రతికూల పరిస్థితుల్లో మేమంతా కలిసి పనిచేశాం. నిజంగా సినిమాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని నేను చాలా మిస్సవుతున్నా..మొత్తానికి సినిమా పూర్తయింది. లీలా థామస్ (సినిమాలో నజ్రియా పాత్ర పేరు), డైరెక్టర్ వివేక్‌ను చాలా మిస్సవుతున్నానంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది నజ్రియా ఫహద్.
Read Also : Naga Chaitanya | చైతూ నెక్ట్స్ సినిమా చేసేది ఈ డైరెక్టర్‌తోనే..!
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నదియా, హర్షవర్దన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. శ్యామ్ సింగ రాయ్ చిత్రం బాక్సాపీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో ఉన్నాడు నాని.
Read Also : Chiranjeevi | రాంచరణ్‌కు అలా విషెస్ చెప్పడం వింతగా ఉంది: ట్విటర్లో చిరంజీవి
Read Also : RRR Hindi collections | ఆర్ఆర్ఆర్ ఫస్ట్ వీకెండ్ హిందీ కలెక్షన్ల సంగతేంటి..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

