టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya)ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ (Thank You) సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే డైరెక్టర్‌తో వెబ్ సిరీస్ దూథ కూడా చేస్తున్నాడు. దీంతోపాటు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌తో లాల్ సింగ్ ఛద్దా చిత్రంలో కీ రోల్ పోషిస్తున్నాడు. కాగా నాగచైతన్య చేయబోయే నెక్ట్స్ సినిమా గురించి కొత్త అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఇటీవలే మానాడు సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టిన తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu)తో చైతూ సినిమా చేయబోతున్నాడు.
ఇదే విషయాన్ని రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలుగులో తాను స్ట్రెయిట్ సినిమా చేస్తున్నట్టు చెప్పారు వెకంట్ ప్రభు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రాబోతుందని, 90లలో బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కించనున్నట్టు స్పష్టం చేశాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ చిత్రంలో పొడుగు కాళ్ల సుందరి పూజాహెగ్డే (Pooja Hegde) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించనున్నట్టు సమాచారం.
పూజాహెగ్డే, నాగచైతన్య కాంబినేషన్ లో ఇప్పటికే ఒక లైలా కోసం సినిమా వచ్చింది. ఈప్రాజెక్టు కన్ఫామ్ అయితే వీరిద్దరి కాంబోలో వచ్చే రెండో చిత్రం కానుంది. మరోవైపు అశోక్ సెల్వన్, సంయుక్తా హెగ్డే కాంబోలో వస్తున్న అప్ కమింగ్ మూవీ మన్మథ లీలై ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు వెంకట్ ప్రభు.
#NagaChaitanya #VenkatPrabhu pic.twitter.com/Al2GinnOJV
— Aakashavaani (@TheAakashavaani) March 27, 2022