KGF Chapter 2 Trailer | గరుడను చంపేసిన తర్వాత ఏం జరిగింది..స్టన్నింగ్‌గా కేజీఎఫ్ 2 ట్రైలర్
సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడొస్తుందా..? అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న క్రేజీ అప్డేట్ రానే వచ్చింది. కేజీఎఫ్ 2 ట్రైలర్ (KGF chapter 2 Trailer)ను మేకర్స్ లాంఛ్ చేశారు. తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను రాంచరణ్ విడుదల చేశాడు.
కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం కేజీఎఫ్ చాఫ్టర్ 2 (KGF chapter 2). యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్లో కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడొస్తుందా..? అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న క్రేజీ అప్డేట్ రానే వచ్చింది. కేజీఎఫ్ 2 ట్రైలర్ ను మేకర్స్ లాంఛ్ చేశారు. ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్ కు బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించాడు.
తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను రాంచరణ్ విడుదల చేశాడు. ‘ కేజీఎఫ్‌లో గరుడను చంపేసిన తర్వాత ఏం జరిగింది..? మీరు చదువుతారా..?’ అనే సంభాషణలతో షురూ అయింది ట్రైలర్. ‘రక్తంతో రాసిన కథ ఇది. సిరాతో ముందుకు తీసుకెళ్లలేం. ముందుకెళ్లాలంటే మళ్లీ రక్తాన్నే అడుగుతుంది..’అని ప్రకాశ్ రాజ్ చెబుతున్న సంభాషణలు సినిమాను రక్తికట్టించేలా సాగుతున్నాయి. ‘కత్తి విసిరి రక్తం చిందించి యుద్దం చేసేది నాశనానికి కాదు..ఉద్దరించడానికి’ అంటూ అధీరాగా సంజయ్ దత్ చెబుతున్న డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
కన్నడ వెర్షన్ ట్రైలర్ ను శివరాజ్ కుమార్, హిందీ ట్రైలర్ ను బాలీవుడ్ హీరో ఫర్హాన్ అఖ్తర్, తమిళ వెర్షన్‌ను కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మలయాళ ట్రైలర్‌ను పృథ్విరాజ్ సుకుమారన్ లాంఛ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న కన్నడతోపాటు వివిధ భాషల్లో విడుదలవుతుంది.
కన్నడ వెర్షన్ ట్రైలర్..
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ తెరకెక్కిస్తున్న కేజీఎఫ్ 2లో బాలీవుడ్ యాక్టర్లు రవీనా టండన్, సంజయ్ దత్‌తోపాటు కన్నడ నటి శ్రీ నిధి శెట్టి, టాలీవుడ్ నటులు రావు రమేశ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

