ఓ వైపు సినిమాలతో అభిమానులను ఎంటర్ టైన్ చేస్తూ..మరో వైపు రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నాడు టాలీవుడ్ యాక్టర్ కమ్ జనసేనాని పవన్‌కల్యాణ్ (Pawan Kalyan). ప్రస్తుతమున్న ఏపీ ప్రభుత్వాన్ని 2024లో గద్దె దించుతూ అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్లనున్నట్టు ఇప్పటికే ప్రకటించి..జన సైనికుల్లో (Jana sena party)నూతనోత్తేజాన్ని నింపారు పవన్. అయితే పాలిటిక్స్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టబోతున్నట్టు ప్రకటించిన పవన్ కల్యాణ్..మరోవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ పెడ్యూల్ కూడా పెట్టుకున్నాడు.
ఇదలా ఉంటే తాజాగా ఈ స్టార్ హీరోతో జీ గ్రూప్ కార్పోరేట్ డీల్ (Zee Group Deal )ను కుదుర్చుకుందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమా చేస్తున్నాడు పవన్. ప్రస్తుతం సెట్స్ పై ఉండగా…జీ గ్రూప్ భారీ మొత్తంలో డబ్బులు పెట్టేందుకు రెడీ అయిందట. అంతేకాదు పవన్ కల్యాణ్ మరో కొత్త సినిమా వినోదయ సీతమ్ రీమేక్ (Vinodaya Sitham remake)విషయంలో కూడా జీ గ్రూప్ ఓ ఒప్పందానికి వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.
దీంతో పవన్ కల్యాణ్‌తో మరో సినిమాకు డీల్ కుదుర్చుకునేందుకు రెడీ అయినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇదే నిజమైతే పవన్‌కల్యాణ్ నెక్ట్స్ రెండు సినిమాలకు జీ గ్రూప్ పూర్తిగా ఫైనాన్స్ చేస్తున్నట్టే. మొత్తానికి తాజాగా వస్తున్న అప్డేట్ పవన్ కల్యాణ్ రాజకీయాల కంటే ఎక్కువగా సినిమాలపైనే ఫోకస్ పెట్టబోతున్నాడా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.