Shilpa Shetty | ఎన్ని సినిమాలు చేశామన్నది.. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర చేశామన్నది ముఖ్యం. అలాంటి పాత్రతోనే తెలుగు ప్రేక్షకుల్లో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది బాలీవుడ్ భామ శిల్పాశెట్టి (Shilpa Shetty). బీటౌన్‌లో ఉన్న లీడింగ్ భామల్లో ఒకరిగా కొనసాగుతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుందని తెలిసిందే.
ఐదు పదుల వయస్సు దగ్గరికొస్తున్నా (49) ఆ ఛాయలేమి కనిపించకుండా జీరో సైజ్ ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తూ కొత్త తరం హీరోయిన్లకు స్ఫూర్తిగా నిలుస్తుంది. తన టైం టేబుల్లో తప్పకుండా జిమ్ సెషన్ ఉండేలా చూసుకునే ఈ భామ తాజాగా జిమ్‌లో ఉన్న స్టిల్‌ను నెట్టింట పోస్ట్ చేసింది. బ్లాక్ జిమ్ వేర్లో హొయలుపోతూ కుర్రకారు మతులు పోగొడుతోంది. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.
చాలా కాలంగా రియాలిటీ షోలతో బిజీగా మారిపోయిన ఈ భామ అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై మెరుస్తుంటుంది. ప్రస్తుతం కన్నడ యాక్టర్ ధృవ సార్జా హీరోగా నటిస్తోన్న కేడీ.. ది డెవల్లో కీలక పాత్రలో నటిస్తున్నారు.
జిమ్‌లో శిల్పాశెట్టి..
#ShilpaShetty effortlessly setting the bar high with her chic black gym fit. 💪#Celebs pic.twitter.com/giUvIiUlDw
— Filmfare (@filmfare) December 9, 2024
Fear Trailer | సైలెంట్‌గా భయపెట్టిస్తోన్న బూచోడు.. సస్పెన్స్‌గా వేదిక ఫియర్ ట్రైలర్