టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ సుధీర్ వర్మ(Sudheer Varma) తెరకెక్కిస్తున్న తాజా చిత్రం శాకిని డాకిని(Saakini Daakini). రెజీనా(Regina), నివేదా(Nivetha Thomas) మెయిన్ లీడ్స్ పోషిస్తున్నారు. ఇవాళ రెజీనా కసాండ్రా పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. రెజీనా, నివేదా ఆర్మీడ్రెస్సుల్లో కనిపిస్తున్నారు. ఈ ఇద్దరి పాత్రలు చాలా పవర్ ఫుల్గా ఉండబోతున్నాయని ఫస్ట్ లుక్తో చెప్పేశాడు సుధీర్ వర్మ. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది.
కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కిడ్నాప్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ సాగనుంది. రిచర్డ్ ప్రసాద్ కెమెరా వర్క్ చేస్తుండగా..మిక్కీ ఎంసీ క్లియరీ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. మరోవైపు నిఖిల్ హీరోగా లండన్ బేస్డ్ మూవీ చేస్తున్నాడు సుధీర్ వర్మ. దీంతోపాటు రవితేజతో ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నాడు.
Introducing the playful, bickering and troublesome @i_nivethathomas and @ReginaCassandra from #SaakiniDaakini !
— BA Raju's Team (@baraju_SuperHit) December 13, 2021
#HBDReginaCassandra @sudheerkvarma @MikeyMcCleary1 @rip_apart @SureshProdns@sbdaggubati @gurufilms1 @SunithaTati @kross_pictures pic.twitter.com/zdC3yLNv8a
రెజీనా ప్రస్తుతం బైలింగ్యువల్ మూవీ నేనే నా చేస్తోంది. దీంతోపాటు మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో వస్తున్న ఆచార్యలో స్పెషల్ సాంగ్ లో మెరువబోతుంది. తమిళంలో నటిస్తోన్న సూర్పనగై, బార్డర్ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Chandrabose hey bidda Song | ‘హే బిడ్డా ఇది నా అడ్డా’ పాటతో హోరెత్తించిన చంద్రబోస్
Akhanda:సెంచరీ కొట్టిన బాలయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న అఖండ