ఆదివారం 24 జనవరి 2021
Cinema - Dec 04, 2020 , 10:17:52

నేటి నుండి సినిమా థియేట‌ర్స్‌లో సందడే సంద‌డి..!

నేటి నుండి సినిమా థియేట‌ర్స్‌లో సందడే సంద‌డి..!

క‌రోనా వ‌ల‌న దాదాపు ఏడెనిమిది నెల‌ల పాటు మూత‌ప‌డ్డ థియేట‌ర్స్ ఈ రోజు నుండి తిరిగి తెరుచుకుంటున్నాయి. క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ థియేట‌ర్స్ న‌డిపేందుకు యాజ‌మాన్యాలు సిద్దం కాగా, సినీ ల‌వ‌ర్స్ పెద్ద తెర‌పై సినిమా చూసేందుకు ఉత్సుక‌త‌తో ఉన్నారు. మ‌హేష్ బాబు, రానా, సాయిధ‌ర‌మ్ తేజ్, బెల్లంకొండ సురేష్ ఇలా ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు పెద్ద తెర‌పై సినిమా సెల‌బ్రిట్ చేసుకోమ‌ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తున్నారు.

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ తాజాగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఇంటి నుండి థియేట‌ర్‌కు వెళ్లిన వీడియోని షేర్ చేస్తూ.. చాలా కాలం తర్వాత థియేటర్‌కు రావ‌డం సంతోషంగా ఉంది. పెద్ద తెరపై సినిమా చూడటం  నాకు సంతోషంగా ఉంది. మీలో చాలామందికి అదే అనిపిస్తుందని నాకు తెలుసు. ఈ రోజు నుండి సినిమాను థియేట‌ర్స్‌లో చూస్తూ సెల‌బ్రేట్ చేసుకుందాం అని పేర్కొన్నారు. తేజూ న‌టించిన సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ చిత్రం డిసెంబ‌ర్ 25న విడుద‌ల కానుంది.


logo