ఎలాగైనా సినిమాల్లోకి రావాలని కలలు కన్నాడు..కష్టపడి సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 (RX 100) తో అదిరిపోయే బ్రేక్ సంపాదించుకున్నాడు. తన ప్రియురాలు లోహిత (Lohita) కిచ్చిన మాట ప్రకారం హీరో అయ్యాక పెద్దలను ఒప్పించి ఈ రోజు పెళ్లి పీటలెక్కాడు యువ హీరో కార్తికేయ గుమ్మకొండ (Karthikeya Gummakonda).
హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఇవాళ ఉదయం 9.47 గంటలకు లోహిత మెడలో మూడు ముళ్లు వేశాడు కార్తికేయ. కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు, స్నేహితుల సమక్షంలో కార్తికేయ-లోహిత పెళ్లి వేడుక అంగరంగవైభవంగా జరిగింది. వధూవరులు సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయారు. పెళ్లి వేడుకలో కార్తికేయ తొలి హీరోయిన్, ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ బ్లూ డ్రెస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మెగాస్టార్ చిరంజీవి వివాహవేడుకకు హాజరై..నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్తికేయ, లోహిత పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Hero @ActorKartikeya tied knot to #Lohitha today at 9.47 am amidst family, friends, wellwishers and fans
— BA Raju's Team (@baraju_SuperHit) November 21, 2021
Congrats and a very happy married life to the new couple✨ pic.twitter.com/4r1ekuf3a8
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
జాతిరత్నాలు బ్యూటీ డ్యాన్స్‌కు నెటిజన్స్ ఫిదా
Pooja Hegde Beach video | సాగరతీరాన బికినీలో పూజా హెగ్డే అందాల విందు..వీడియో వైరల్
Kangana Ranaut Vs Vir Das | స్టార్ కమెడియన్‌పై చర్యలకు కంగనా డిమాండ్
Sai Pallavi | ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?