RRR Trailer Update | వెయిట్ ఈజ్ ఓవర్.. ‘త్రిబుల్ ఆర్’ ట్రైలర్ కమింగ్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అంతా వేచి చూస్తున్న సినిమా త్రిబుల్ ఆర్ (RRR). బాహుబలి తర్వాత రాజమౌళి (SS Rajamouli) నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మాత్రం అంచనాలు ఉండటం ఖాయం.

కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అంతా వేచి చూస్తున్న సినిమా త్రిబుల్ ఆర్ (RRR). రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఉన్న అంచనాల గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 15 వేల థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగుతోపాటు మిగిలిన అన్ని భాషల్లో కూడా అదే స్థాయిలో విడుదల అవుతుంది ఇది. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మాత్రం అంచనాలు ఉండటం ఖాయం.
డి.వి.వి దానయ్య దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాడు. ఇప్పటికే విడుదలైన ప్రతి విజువల్ సినిమాపై అంచనాలు పదింతలు పెంచేసింది. టైలర్ కోసం వేచి చూస్తున్న అభిమానులకు తీపి కబురు చెప్పారు దర్శక నిర్మాతలు. డిసెంబర్ 3న విడుదల అవుతుందని పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది చూసిన తర్వాత అటు నందమూరి.. ఇటు మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ఓకే ఫ్రేమ్ లో చూడాలన్న వాళ్ల కలను రాజమౌళి పూర్తి చేశాడు. ఇప్పటికే విడుదలైన నాటు నాటు పాటలో ఎన్టీఆర్ (Jr NTR), చరణ్ (Ram charan), డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొన్న విడుదలైన జనని పాటకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇప్పుడు ట్రైలర్ విడుదల (RRR Trailer) కు రంగం సిద్ధమైంది.
దాదాపు మూడు నిమిషాలకు పైగా ఈ ట్రైలర్ ఉండబోతుంది అని తెలుస్తోంది. ఇది విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయని నమ్మకంగా కనిపిస్తున్నారు దర్శక నిర్మాతలు. 2017లో ఈ సినిమాకు నాంది వేసిన రాజమౌళి నాలుగేళ్ల పాటు తెరకెక్కిస్తూనే ఉన్నాడు. మొత్తానికి షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా పూర్తి చేసి మరో నెల రోజుల్లో సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నాడు దర్శకధీరుడు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 500 కోట్లకు పైగా జరిగింది. మొత్తానికి ట్రైలర్ విడుదలైన తర్వాత సంచలనాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పటి నుంచే లెక్కేసుకుంటున్నారు అభిమానులు. ఇందులో ఎన్టీఆర్, చరణ్ మాత్రమే కాదు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, శ్రియ, సముద్రఖని, ఒలివియా మొర్రీస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 7, 2022న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
ఇది కూడా చూడండి
Naatu Naatu song | నాటు నాటు స్పీడు మామూలుగా లేదు..75 మిలియన్ వ్యూస్..!
Akhanda Vs Lovestory | లవ్‌స్టోరీని అఖండ బీట్ చేస్తుందా..?
Siddhas Saga Teaser | ధర్మస్థలికి ఆపదొస్తే..‘సిద్ధ’గా రాంచరణ్ క్లాస్, మాస్ ఎంట్రీ అదిరింది..వీడియోMurali Sharma doctorate | మహేశ్‌బాబు విలన్‌కు గౌరవ డాక్టరేట్
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

