Naatu Naatu song | నాటు నాటు స్పీడు మామూలుగా లేదు..75 మిలియన్ వ్యూస్..!
ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ చిత్రాల్లో ఒకటి ర్ఆర్ (RRR). ఇటీవలే విడుదలైన మాస్ బీట్ సాంగ్ నాటు నాటు (Naatu Naatu song) వ్యూస్ పంట పండిస్తోంది.

ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రేజీ చిత్రాల్లో ఒకటి. 2022 జనవరి 7న గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా ఆర్ఆర్ఆర్ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ల నుంచి గ్లింప్స్ వీడియోలు, సాంగ్స్ అన్ని రికార్డులను కొల్లగొడుతున్నాయి. ఇటీవలే విడుదలైన మాస్ బీట్ సాంగ్ నాటు నాటు (Naatu Naatu song) వ్యూస్ పంట పండిస్తోంది.
రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య వచ్చే ఈ సాంగ్ ఇపుడు 75 మిలియన్ల వ్యూస్ దాటింది. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో రాంచరణ్, ఎన్టీఆర్ ఇరగదీసే స్టెప్పులేసి అదరగొట్టారు. నాటు నాటు సాంగ్ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి ఈ ఫీట్ చేరుకుంది. ఇప్పటికే ఈ పాటకు సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. చిన్నారులతోపాటు యువతీ యువకులు నాటు నాటు పాటకు స్టెప్పులేస్తూ నెట్టింటిని షేక్ చేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ నటిస్తుండగా..కొమ్రంభీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. అలియాభట్ సీత పాత్రలో కనిపించనుండగా..ఒలివియా మొర్రీస్ తారక్‌కు జోడీగా నటిస్తోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు సముద్రఖని, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్, శ్రియా శరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇది కూడా చూడండి
Siddhas Saga Teaser | ధర్మస్థలికి ఆపదొస్తే..‘సిద్ధ’గా రాంచరణ్ క్లాస్, మాస్ ఎంట్రీ అదిరింది..వీడియోMurali Sharma doctorate | మహేశ్‌బాబు విలన్‌కు గౌరవ డాక్టరేట్
Mahesh Babu black Royal look | న్యూ స్టైలిష్ లుక్‌లో మహేశ్‌బాబు..ఫొటోషూట్ అదిరింది
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

