RRR controversy | అసలే సంక్రాంతికి వస్తుందనుకున్న సినిమా ఆగిపోవడంతో చిరాకులో ఉన్నారు చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇలాంటి సమయంలో కాంట్రవర్సీలు అంటే మరింత కాలిపోవడం ఖాయం. కానీ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. ఈ సినిమాలో ఇద్దరు స్వతంత్ర సమరయోధులు ఉన్నారు.. ఒకరు కొమరం భీమ్ అయితే మరొకరు అల్లూరి సీతారామరాజు.. ఈ ఇద్దరి జీవితంపై తెరకెక్కుతున్న సినిమా అనగానే కాంట్రవర్సీలు కూడా వస్తాయని రాజమౌళికి తెలియని విషయం కాదు. అందుకే షూటింగ్ జరుగుతున్నప్పుడే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది పూర్తిగా కల్పిత గాథ అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఇప్పుడు అనుకున్నట్లుగానే ఈ చిత్రాన్ని కాంట్రవర్సీలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన చరణ్, ఎన్టీఆర్ విజువల్స్ పై వివాదాలు చుట్టు ముడుతున్నాయి. ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్యక్షుడు వీరభద్రరావు ఈ సినిమాపై ఫైర్ అయ్యాడు.
ట్రిపుల్ ఆర్ సినిమాలోని పలు సన్నివేశాలను తీసేయాలంటూ వీరభద్రరావు ఏకంగా ఏపీ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. చరిత్రను వక్రీకరిస్తుంటే చూస్తూ ఊరుకోమని.. కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు చరిత్రను వక్రీకరించే సన్నివేశాలు తీయొద్దని ఆయన రాజమౌళిని కోరుతున్నాడు. కేవలం డబ్బుల కోసం కమర్షియల్ పేరుతో స్వతంత్ర సమరయోధుల జీవితాలను ఇష్టం వచ్చినట్లు వాడుకుంటే చూస్తూ ఊరుకోమని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు వీరభద్రరావు. అల్లూరి సీతారామరాజు 1897లో విశాఖపట్టణం పాండ్రంకిలో పుట్టాడని.. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో 1924 మే 7న తెల్లవారి కాల్పుల్లో వీరమరణం పొందారని తెలిపాడు. అదే సమయంలో కొమురం భీం 1901లో జన్మించి 1941లో మరణించారని చరిత్ర చెబుతోందని వీరభద్రరావు తెలిపారు. ఇద్దరు కలిసినట్లు చరిత్రలో ఎక్కడా లేదని.. చరిత్రలో లేని విషయాలను సినిమాలో ఎలా చూపిస్తారని ప్రశ్నిస్తున్నాడు.
మరోవైపు రాజమౌళి మాత్రం ఇది పూర్తిగా కల్పితం అని.. 1920 ప్రాంతంలో ఒకవేళ ఇద్దరూ కలిసి ఉంటే ఎలా ఉండేది అనేది సినిమా కథ అంటున్నాడు. మొత్తానికి రాజమౌళి మల్టీస్టారర్ పై కూడా వివాదాలు మొదలయ్యాయి. కొమరం భీమ్ అనుచరులు కూడా ఇలాగే వార్నింగ్స్ ఇచ్చారు. ఇందులో ఎన్టీఆర్ ముస్లిం గెటప్‌లో కనిపించాడు. చరిత్రను ఇక్కడ వక్రీకరిస్తున్నారని.. అసలు భీమ్ ఎలా ముస్లింగా మారాడని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. అయితే రజాకార్ల నుంచి తప్పించుకునే క్రమంలోనే భీమ్ చాలా గెటప్స్ లో కనిపించాడని.. అందులో భాగంగానే ఇలా కనిపించి ఉంటాడని అంతా అనుకుంటున్నారు. అసలు ముస్లిం గెటప్‌లో ఎన్టీఆర్ ఎందుకు కనిపించాడనేది సినిమా చూస్తే అర్థమవుతుందని దర్శక నిర్మాతలు చెప్తున్నారు. మరి ఇది ఎక్కడ ఆగుతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
సమ్మర్ బాట పట్టిన పెద్ద సినిమాలు.. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో!!
RRR విడుదలపై స్పందించిన హీరో రామ్‌చరణ్
మాకు సినిమా వద్దు.. డబ్బులు వెనక్కి ఇచ్చేయండి.. RRR నిర్మాతకు కొత్త తలనొప్పి..
RRR కారణంగా ఎన్టీఆర్ ఎంత నష్టపోయాడో తెలుసా..?