RS praveen kumar | సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో మహేశ్, పీఏ మహేందర్ రెడ్డిపై దాడి చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ముసుగులు ధరించిన కొంతమంది వ్యక్తులు పోలీస్‌స్టేషన్‌లోకి ప్రవేశించి కేటీఆర్ సిబ్బందిపై దాడికి యత్నించారని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టగా.. అసలు ఎలాంటి దాడి జరగలేదని పోలీస్‌స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించామని, దాడికి సంబంధించిన ఎలాంటి ఘటన కనిపించలేదని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డీసీపీ శిల్పవల్లికి ప్రశ్నలు సంధించారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇదేదో యాదృచ్చికంగా జరిగిన సంఘటన కాదని తెలంగాణ ప్రజలకు చెప్పదలచుకుంటున్నా.. కావాలని 6:30 గంటలకు వాళ్లను వదలకుండా.. అదే టైంకు సరిగ్గా ఈ మాస్క్ వేస్కున్న దుండగులను ఎవరో పంపించారు. అది డీసీపీ చెప్పాలి.. డీజే పర్మిషన్ కోసం స్థానికులు కొద్ది మంది డీజే పర్మిషన్ కోసం సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు వస్తే వాళ్లు నిరాకరిస్తే గొడవ జరిగిందంటున్నారు.. డీసీపీ మేడమ్ మీకు కూడా 10-12 సంవత్సరాల సర్వీస్ ఉంటది.. మీరు డీజే పర్మిషనే మీరు ఇవ్వడం లేదు.. ఒకవేళ ఇవ్వాలన్నా వాళ్లు ముందు మీ సేవలో అప్లై చేయాలి. చేసిన తర్వాత వాళ్ల సెక్టార్ ఎస్ఐ దగ్గరకు పోతడు. సెక్టార్ ఎస్ఐ తర్వాత స్టేషన్ ఆఫీసర్ దగ్గరకొస్తడు. అంటే సీఐ ర్యాంక్ ఆఫీసర్ దగ్గరికొస్తడు. వచ్చినా కూడా ఒక్కరో ఇద్దరో వస్తరు.. పర్మిషన్ కోసం 15-30 మంది రారు మేడమ్. వచ్చేటోడు మాస్క్ ఎందుకు వేసుకుని వస్తడు మేడమ్ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
డీసీపీ శిల్పవల్లి దయచేసి ఈ విషయం చెప్పాలి.. లేకపోతే మిమ్మల్ని వెనుక నుంచి గైడ్ చేస్తున్న ఆఫీసర్లు వాళ్లు ఇంటెలిజెన్స్ వాళ్లా.. లేకపోతే హైదరాబాద్ సిటీ పోలీసులా, డీజపీనా.. వాళ్లైనా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. డీజే పర్మిషన్ కోసం ఒకరు లేదా ఇద్దరొస్తరు.. కానీ 15 నుంచి 30 మంది ఎందుకొస్తరో చెప్పాలి మేడమ్ అన్నారు. పోని స్థానికులు అని అన్నరు.. మరి స్థానికులైతే ఒక్కరినైనా పట్టుకొచ్చి అరెస్ట్ చేశారా..? స్థానికులని మీరే అంటున్నరు.. ఎట్లా చెప్తున్నరు.. స్థానికులని మే బేసిస్ మీద చెప్తున్నరు.. స్థానికులైతే మీరు తీసుకురండి.. రాత్రికి రాత్రి మీరు టాస్క్‌ఫోర్స్ ను పంపించి తీసుకురావొచ్చు కదా.. ఎంతసేపు మేడమ్ మీ దగ్గరు ఇంతమంది పోలీసువాళ్లున్నారు అని ప్రశ్నించారు.
ఎవరైనా మాస్కులు పెట్టుకుని డీజే పర్మిషన్ కోసం వస్తారా డీసీపీ శిల్పవల్లి గారు?
డీజే పర్మిషన్ కోసం 30 మంది రారు.. ఒక్కరో ఇద్దరో వస్తారు
సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ సిబ్బందిపై జరిగిన దాడిపై డీసీపీ శిల్పవల్లిని, పోలీసులను ప్రశ్నించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అక్కడ అంత మంది… https://t.co/qHb5QY7eF2 pic.twitter.com/Z6xMjuGgdS
— Telugu Scribe (@TeluguScribe) September 15, 2026
Uttar Pradesh | యూపీలో కారు అదుపుతప్పి ముగ్గురు మృతి.. ఆరుగురి పరిస్థితి విషమం
KA Paul | యుద్ధాలు 58, ప్రభావం 850 కోట్ల మందిపై.. ఆవేదన వ్యక్తంచేసిన కేఏ పాల్
హయత్‌నగర్ పరిధిలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. 20 మందికి తీవ్ర గాయాలు