RRR విడుదలపై స్పందించిన హీరో రామ్‌చరణ్
RRR | RRR సినిమా విడుదలపై హీరో రామ్‌చరణ్ స్పందించారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ‘రౌడీబాయ్స్' మ్యూజికల్ ఈవెంట్‌కు రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ.. సంక్రాంతికి మా

RRR సినిమా విడుదలపై హీరో రామ్‌చరణ్ స్పందించారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ‘రౌడీబాయ్స్’ మ్యూజికల్ ఈవెంట్‌కు రామ్‌చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి మా సినిమా రాకపోయిన మాకు బాధ లేదు. ఎందుకంటే కరెక్టు అయినా సమయంలోనే ఆ సినిమా రావాలి. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం మూడున్నరేండ్లు చాలా కష్టపడ్డాం. సినిమా విడుదల ఎప్పుడనేది డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత దానయ్య నిర్ణయిస్తారని తెలిపారు.
సంక్రాంతి పండుగ తమకు ముఖ్యమో, కాదో తెలియదు కానీ ఈ పండుగ దిల్ రాజుకు ఎంతో ముఖ్యం. ఈ సంక్రాంతి ఆయనకు మరోసారి కలిసి రావాలని కోరుకుంటున్నాను అని రామ్‌చరణ్ పేర్కొన్నారు.
రౌడీ బాయ్స్ చిత్రంలో ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. ఈ నెల 14న ఈ చిత్రం విడుదలకానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

