Air India CEO | ఎయిర్ ఇండియా సీఈవోకు సమన్లు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
Air India CEO | ఎయిర్ ఇండియా సీఈవోకు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో ముగ్గురు విదేశీయులకు సంబంధించిన ఇమ్మిగ్రేషన్ లోపంపై ఈ చర్యలు చేపట్టింది.
Air India CEO | ఢిల్లీ: ఇమ్మిగ్రేషన్ (Immigration) ప్రక్రియను పూర్తి చేయకుండానే ముగ్గురు ఇటాలియన్లను ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కడానికి అనుమతించారనే ఆరోపణలపై ఎయిరిండియా సీఈవోకు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ముగ్గురు ప్రయాణికులు అమృత్సర్ నుంచి ఢిల్లీకి సెప్టెంబర్ 4న వచ్చారు. వారు ఎలాంటి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లేకుండానే ఢిల్లీ నుంచి మ్యూనిచ్కు వెళ్లే లుఫ్తాన్సా ఫ్లైట్ ఎక్కారు. విషయం తెలిసి దీనిపై చర్చించేందుకు హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో సీనియర్ అధికారులు, స్టేక్హోల్డర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు.
ఆ ముగ్గురు ప్రయాణికులకు ఢిల్లీకి వెళ్లే ఎయిరిండియా విమానం, మ్యూనిచ్కు వెళ్లే లుఫ్తాన్సా విమానం రెండింటికి అమృత్సర్లో బోర్డింగ్ పాస్ జారీ చేశారు. ఎయిరిండియా ప్రవేశపెట్టిన ‘హబ్ అండ్ స్పోక్ (Hub-and-Spoke)’ విధానంలో అమృత్సర్ విమానాశ్రయం ఒకటి. దీని ప్రకారం విమానం బయలుదేరే విమానాశ్రయంలోనే ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా విదేశాలకు ప్రయాణించవచ్చు. ఇంటర్నేషనల్ విమానం వెళ్లే విమానాశ్రయంలో కేవలం భద్రతా తనిఖీని పూర్తి చేసుకుని విమానం ఎక్కుతారు. ఇక్కడ అమృత్సర్ స్పోక్గా, ఢిల్లీ హబ్గా ఉంటుంది.
ఈ ముగ్గురి ఇటాలియన్ ప్రయాణికుల విషయంలో ఢిల్లీ విమానంతో పాటు మ్యూనిచ్ వెళ్లే లుఫ్తాన్సా విమానం కోసం అమృత్సర్లోనే బోర్డింగ్ పాస్లు జారీ అయ్యాయి. అయితే ఆ రెండు విమానాలు హబ్ అండ్ స్పోక్ విధానంలోకి రావు. కాబట్టి వారు లుఫ్తాన్సా విమానం ఎక్కే ముందు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
విమానయాన సంస్థలో భద్రత, నిబంధనలు పాటించడం, జవాబుదారీతనం వంటి వాటిపై ఎయిరిండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ (Chandrasekharan) ఓ సమావేశంలో చెప్పారు. ఇలా ఆయన చెప్పిన కొద్దిరోజులకే ఈ ఘటన జరగడంతో చర్చనీయాంశంగా మారింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

