న్యూయార్క్: అమెరికాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకున్నది. న్యూయార్క్‌లో సబ్వే రైలు(Subway Train) ఢీకొని ఇద్దరు మృతిచెందారు. ఆ ఇద్దరిలో ఒకరు భారతీయ సంతతి మహిళ కాగా, మరొకరు నేపాలీ అమెరికన్ స్నేహితుడు. ఆ ఇద్దరి వయసు 24 ఏళ్లు. లోవర్ మన్‌హట్టన్ స్టేషన్ సమీపంలో ట్రాక్‌పై కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. న్యూజెర్సీలోని డేటన్కు చెందిన మలైకా చిత్రే, సేరవిల్లేకు చెందిన నవమ్ కౌల్ ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. స్ప్రింగ్ స్ట్రీట్ సబ్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
తెల్లవారుజామున 3.15 నిమిషాలకు 4వ నెంబర్ ట్రైన్ వాళ్లను ఢీకొన్నట్లు న్యూయార్క్ పోలీసు శాఖ తెలిపింది. సమీపంలో ఉన్న ఓ వ్యక్తి ఆ ఇద్దర్ని ట్రైన్ ఢీకొట్టే వీడియో తీశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతోంది. రైలు ఢీకొట్టడానికి ముందు ఆ ఇద్దరూ పట్టాలపై మాట్లాడుకుంటూ కూర్చుని ఉన్నట్లు చెప్పారు. బాధితురాలు చిత్రే ఆ సమయంలో నవ్వుతూ ఉన్నట్లు కనిపించిందని రైలు డ్రైవర్ తెలిపారు. రైలు సమీపిస్తున్న సమయంలో కౌల్‌ను తన వైపు చిత్రే లాగుకున్నట్లు డ్రైవర్ చెప్పాడు.
బహుశా ఆ ఇద్దరిలో ఒకరు ట్రాక్‌పై పడి ఉంటారని, వారిని రక్షించేందుకు మరో వ్యక్తి ఆ ట్రాక్‌పై దిగినట్లు తెలుస్తోందని అధికారులు చెప్పారు. ఇద్దరూ ట్రాక్‌పై ఉన్నట్లు గమనించి, రైలును ఆపేందుకు ప్రయత్నించానని, కానీ ఎమర్జెన్సీ బ్రేక్‌లు పడలేదని ట్రైన్ ఆపరేటర్ తెలిపాడు. ఈ ఘటన నేపథ్యంలో ఆ రైలు నుంచి 100 మంది ప్రయాణికులను తరలించారు. అయితే ట్రాక్‌పై ఆ ఇద్దరు ఏం చేస్తున్నారు, అక్కడకు ఎలా వచ్చారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్‌ను మాత్రం గుర్తించలేదు.
ఆ ఇద్దరూ రట్జర్స్ వర్సిటీలో చదువుతుకున్నట్లు తెలుస్తోంది. మలైకా చిత్రే అకాడియా ఫార్మాసిటికల్స్లో, కౌల్ బ్లూమ్‌బర్గ్‌లో ఫైనాన్షియల్ డేటా అనలిస్టుగా చేస్తున్నట్లు తెలిసింది.
纽约曼哈顿发生一起地铁悲剧:24岁的彭博金融数据分析师 Navam Kaul 与好友 Malaika Chitre周日凌晨约3:14出现在 Spring Street 站轨道上,Kaul 可能先跌落或自行下到轨道,Chitre 随后下去帮助他。南行4号线驶入时,司机紧急刹车但已来不及,两人当场身亡。监控显示他们事发前仍坐在轨道上互动。… pic.twitter.com/h1GUUHg5lN
— 紀春生 (@jichunsheng) September 15, 2026