Power House | విక్రమ్ కొత్త సినిమా ‘పవర్ హౌస్’ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో విడుదల!
Chiyaan Vikram | కోలీవుడ్ స్టార్ హీరో చీయన్ విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తున్న తాజా చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వినాయక చవితి కానుకగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు.
Power House | కోలీవుడ్ స్టార్ హీరో చీయన్ విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తున్న తాజా చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వినాయక చవితి కానుకగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను విడుదల చేశారు. విక్రమ్ కెరీర్లో 63వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి ‘పవర్ హౌస్’ (Power House) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘ఇరు ముగన్’ వంటి సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత విక్రమ్, దర్శకుడు ఆనంద్ శంకర్ (Anand Shankar) కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై భారీ హైప్ ఏర్పడింది. విడుదలైన టైటిల్ ప్రోమో చాలా ఆసక్తికరంగా సాగింది. ఇందులో విక్రమ్ ఒక సాధారణ వెడ్డింగ్ క్యాటరర్‌గా తన కుటుంబంతో సరదాగా కనిపిస్తూనే, మరోవైపు తనలోని డార్క్ అండ్ వయొలెంట్ షేడ్‌ను చూపించి ఆకట్టుకున్నారు. స్టోరేజ్ రూమ్‌లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి కట్టేసి ఉండడం ఈ టీజర్‌లోని ప్రధాన హైలైట్‌గా నిలిచింది.
ఈ చిత్రంలో ఊర్వశి, విటీవీ గణేష్, రియా షిబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా, సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan) సంగీతం అందిస్తున్నారు. ఈ టైటిల్ ప్రోమోను బట్టి సినిమాను 2027లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే తెలుగు వెర్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా రానున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

