తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటిన సినిమా ఆర్ఆర్ఆర్ (RRR). బాహుబలి తర్వాత ఎస్ఎస్ రాజమౌళి కాంపౌండ్ నుంచి వచ్చిన ఆర్ఆర్ఆర్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆర్ఆర్ఆర్తో అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తెలుగు సినిమా క్రేజ్‌ను పెంచేశాడు జక్కన్న.
ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఆర్ఆర్ఆర్ ఇపుడు అరుదైన రికార్డు అందుకుంది. జపాన్‌లో కేవలం నాలుగు వారాల్లోనే 250 మిలియన్ యెన్(రూ.14,57,48,919 కోట్లు) లు రాబట్టిన భారతీయ సినిమాగా నిలిచింది. బాహుబలి 2 ఈ ఫిగర్‌ను చేరుకోవడానికి 36 వారాలు తీసుకోగా.. ఊహించని విధంగా నాలుగు వారాల్లోనే వేగంగా క్రాస్ చేసి టాప్‌లో నిలిచింది ఆర్ఆర్ఆర్.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ (Ram Charan) అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా.. ఎన్టీఆర్ (Jr NTR) కొమ్రంభీం పాత్ర పోషించాడు. ఈ ఎపిక్ డ్రామాలో అలియాభట్, అజయ్ దేవ్గన్, శ్రియాశరణ్, ఒలివియా మొర్రీస్, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు.
డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా కలెక్షన్లు వసూళ్లు చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
Read Also :Driver Jamuna | డ్రైవర్ జమున విడుదల వాయిదా.. ఇంతకీ కారణమేంటో?