The Vaccine War | వివేక్ అగ్నిహోత్రి కొత్త సినిమా టైటిల్ ది వాక్సిన్ వార్.. పూర్తి వివరాలివే
ది కశ్మీర్ ఫైల్స్ ను తెరకెక్కించిన నిర్మాత అభిషేక్ అగర్వాల్‌తో కలిసి మరో సినిమా చేస్తున్నట్టు ప్రకటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు వివేక్ అగ్నిహోత్రి. కాగా వివేక్ అగ్నిహోత్రి అండ్ టీం ఇవాళ సినిమా టైటిల్‌పై నెలకొన్న సస్పెన్స్‌కు తెర దించింది.
ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో మంచి బ్రేక్ అందుకున్నాడు బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి (Vivek Agnihotri). ది కశ్మీర్ ఫైల్స్ ను తెరకెక్కించిన నిర్మాత అభిషేక్ అగర్వాల్‌తో కలిసి మరో సినిమా చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు వివేక్ అగ్నిహోత్రి. The War టైటిల్ మధ్యలో ఉన్న పదాన్ని పూరించి.. సినిమా పేరేంటో చెప్పగలరా ..? అంటూ ఇప్పటికే వివేక్ అగ్నిహోత్రి చేసిన ట్వీట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
కాగా వివేక్ అగ్నిహోత్రి అండ్ టీం ఇవాళ సినిమా టైటిల్‌పై నెలకొన్న సస్పెన్స్‌కు తెర దించింది. ఈ చిత్రానికి ది వాక్సిన్ వార్ #TheVaccineWar టైటిల్‌ను ఖరారు చేశాడు డైరెక్టర్. అంతేకాదు ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళంతోపాటు మరో 8 భాషల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ చిత్రం 2023 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
మీకు తెలియని, మీరు పోరాడి గెలిచిన యుద్దం..అంటూ టైటిల్ లుక్‌లో రాసిన లైన్ ఈ సినిమా కరోనా సంక్షోభం, వాక్సినేషన్ నేపథ్యంలో రాబోతున్నట్టు చెబుతోంది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లో పల్లవి జోషి తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది. వివేక్ అగ్నిహోత్రి చాలా సున్నితమైన కశ్మీరీ పండిట్లపై జరిగిన దాడుల అంశం నేపథ్యంలో తెరకెక్కించిన ది కశ్మీర్ ఫైల్స్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ ..
ANNOUNCEMENT:
Presenting ‘THE VACCINE WAR’ – an incredible true story of a war that you didn’t know India fought. And won with its science, courage & great Indian values.
It will release on Independence Day, 2023. In 11 languages.
Please bless us.#TheVaccineWar pic.twitter.com/T4MGQwKBMg
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) November 10, 2022
From the makers of #TheKashmirFiles, comes another hard hitting story – #TheVaccineWar 🇮🇳
Grand release on Independence Day 2023 in 11 languages 💥@vivekagnihotri #PallaviJoshi @abhishekofficl @i_ambuddha @aaartsofficial @proyuvraaj pic.twitter.com/l14CVSVrcw
— BA Raju's Team (@baraju_SuperHit) November 10, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

