Mr Bachchan | మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్ట్ చేస్తున్నాడు. రవితేజ టీం ఇప్పటికే ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టిందని తెలిసిందే. మిస్టర్ బచ్చన్ ఫస్ట్ సింగిల్ సితార్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. సితార్ సాంగ్ మూవీ అండ్ మ్యూజిక్ లవర్స్ మనసు దోచేస్తుంది.
సితార్ ప్రోమో, లిరికల్ వీడియో సాంగ్ ఇంప్రెస్ చేస్తూ నెట్టింట 2.5 మిలియన్లకుపైగా వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే మ్యూజిక్ లవర్స్‌ను ఫిదా చేస్తూ సినిమాపై అంచనాలు పెంచుతోంది. రవితేజ, భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీలో అందమైన లొకేషన్లలో సాగుతున్న ఈ సాంగ్ సినిమాకు స్పెసల్ అట్రాక్షన్‌గా నిలువనుందని తాజా వార్త చెప్పకనే చెబుతోంది.
మేకర్స్ ఇప్పటికే షేర్ చేసిన మిస్టర్ బచ్చన్ టైటిల్ పోస్టర్లో మాస్ మహారాజా అమితాబ్ లుక్‌లో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తున్నాడు. ఈ చిత్రానిక ఇమిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. రవితేజ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌బచ్చన్‌కు వీరాభిమాని అని తెలిసిందే. మాస్ మహారాజా తాజా చిత్రానికి మిస్టర్ బచ్చన్ టైటిల్ పెట్టడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ మూవీలో కథానుగుణంగా రవితేజ బిగ్ బీ అభిమానిగా కనిపించనున్నాడని ఇన్సైడ్ టాక్.
#SitarSong is every music lover’s favorite right now 🎼#MrBachchan first single TRENDING TOP on YouTube with 2.5 MILLION+ VIEWS ❤️🔥
A @MickeyJMeyer musical✨
Lyrics by #Sahithi ✍️
Sung by @SakethKomanduri & #SameeraBharadwaj 🎙️#MassReunion
Mass… pic.twitter.com/ekSfidzPTp— People Media Factory (@peoplemediafcy) July 12, 2024
Sarangadhariya Review | రాజా రవీంద్ర సారంగదరియా ఎలా ఉందంటే..?
Filmfare Awards | ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘ఆర్ఆర్ఆర్’.. ఏకంగా 8 అవార్డులు
Bharateeyudu 2 Review | కమల్ హాసన్ సేమ్ మ్యాజిక్ రిపీట్ చేశాడా..? శంకర్ భారతీయుడు 2 ఎలా ఉందంటే..!
Maharaja | ఓటీటీలోకి విజయ్ సేతుపతి మహారాజ.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే..?
సితార్ లిరికల్ వీడియో సాంగ్..