Sarangadhariya Review | రాజా రవీంద్ర సారంగదరియా ఎలా ఉందంటే..?
Sarangadhariya Review | రాజా రవీంద్ర (Raja Ravindra) తొలిసారి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘సారంగదరియా’ (Sarangadhariya). ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి పద్మారావు అబ్బిశెట్టి (డెబ్యూ)దర్శకత్వం వహించాడు. నేడు థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందనే దానిపై ఓ లుక్కేస్తే..
Sarangadhariya Review | తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదని యాక్టర్ రాజా రవీంద్ర (Raja Ravindra). క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించిన రాజా రవీంద్ర తొలిసారి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘సారంగదరియా’ (Sarangadhariya). ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి పద్మారావు అబ్బిశెట్టి (డెబ్యూ)దర్శకత్వం వహించాడు. నేడు థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందనే దానిపై ఓ లుక్కేస్తే..
ఇంతకీ కథేంటి..?
లెక్చరర్‌గా పనిచేసే రాజా రవీంద్ర (కృష్ణకుమార్) ది మధ్య తరగతి కుటుంబం. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. లవ్ ఫెయిల్యూర్ అయిన పెద్ద కుమారుడు ప్రేమ విఫలమవడంతో ఇంటి గురించి ఏం పట్టించుకోకుండా రోజూ తాగుతూ.. ఎవరో ఒకరితో గొడవపెట్టుకుంటుంటాడు. ఇక కాలేజ్, ఇంటికే పరిమితమైన కూతురు అను వెంట ప్రేమ పేరుతో వెంట పడుతుంటాడు రాజ్. ఇక చిన్న కుమారుడు సాయి ఎవరో ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటాడు.
కూతురుకి పెళ్లి సంబంధాలు వస్తుంటాయి. ఇంట్లో మనశ్శాంతి కోసం వ్రతం చేయించాలని నిర్ణయించుకునే క్రమంలో కూతురు మోడల్ అవ్వాలనే ప్రయత్నాల్లో ఉందనే సీక్రెట్ బయట పడుతుంది. ఇంతకీ ఆమె ప్రయత్నం ఏమైంది.. తన ఇద్దరు కుమారులు, కూతురు సమస్యల నుంచి కృష్ణకుమార్ బయట పడ్డాడనేదే స్టోరీ.
మధ్య తరగతి కుటుంబంలోని కష్టాలను కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ పండు. ఒకేసారి నాలుగైదు కథలను తెరపై చూపించడం టాస్క్ లాంటిదే. సినిమాలో ఓ వైపు బావోద్వేగాలకు ప్రాధాన్యమిస్తూనే.. మరోవైపు మంచి సందేశాన్ని అందించే దర్శకుడి ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు మూవీ లవర్స్. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఈ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేలా.. డైరెక్టర్ కథను వినోదాత్మకంగా.. కమర్షియల్‌గా చెప్పాడని ఇప్పటివరకు వచ్చిన టాక్ చెబుతోంది.
సినిమా ఎలా ఉందంటే.. ?
సున్తీ చేయించుకొని వచ్చావా.. అయినా కులమంటే రక్తం కాదు సార్.. పుట్టుకతో రావడానికి.. మనం చేసే పనే కులం సార్..అనే డైలాగ్స్‌తోపాటు మందు, సిగరెట్లు, పేకాట, బెట్టింగ్స్.. వీటన్నింటి కంటే పెద్ద వ్యసనం ఫెయిల్యూర్.. అది మనకు తెలియకుండానే మనం రాజీపడి బ్రతికేలా చేసేస్తుంది. అది ఎంతవరకు అంటే.. నువ్వింతే ఇంతకు మించి నువ్వేం చేయలేవని డిసైడ్ చేసి నీకే బాసై కూర్చుంటుంది.. ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతాం.. కానీ జీవితం పరీక్షలు పెట్టి గుణపాఠాలు చెబుతుంది.. అంటూ సినిమాలో వచ్చే సంభాషణలు అందరినీ ఆలోచింపజేసేలా సాగుతూ సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తాయి.
ఇక రాజా రవీంద్ర లీడ్ రోల్లో కృష్ణకుమార్ పాత్రకు పర్ఫెక్ట్గా న్యాయం చేశాడని.. రాజారవీంద్ర సన్నివేశాలు ఎమోషనల్‌గా సాగుతూ చాలా మందికి కనెక్ట్ అవుతాయని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. ఇక ప్రధాన పాత్రల్లో నటించిన శివ చందు, యశస్విని, మొయిన్ , మోహిత్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారంటున్నారు. సినిమా కొంత ఇంట్రెస్టింగ్గా కనిపించినా.. కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా అనిపించేలా సాగుతాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. మిగిలిన అంశాల మాటెలా ఉన్నా మంచి సందేశాత్మక సినిమాగా చూడొచ్చంటున్నారు.
Read Also :
Filmfare Awards | ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘ఆర్ఆర్ఆర్’.. ఏకంగా 8 అవార్డులు
Suriya | సర్ఫిరా మనందరికీ ముఖ్యమైన సినిమా.. ట్రెండింగ్‌లో సూర్య టీం స్టిల్
Bharateeyudu 2 Review | కమల్ హాసన్ సేమ్ మ్యాజిక్ రిపీట్ చేశాడా..? శంకర్ భారతీయుడు 2 ఎలా ఉందంటే..!
Maharaja | ఓటీటీలోకి విజయ్ సేతుపతి మహారాజ.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
చందమామ అందానికి ఫిదా అవ్వాల్సిందే.. బ్లాక్ డ్రెస్‌లో కాజల్ హాట్ ఫొటోలు వైరల్!
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

