టాలీవుడ్ హీరోలు పవన్ కల్యాణ్-రానా కాంబోలో అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ పర్యవేక్షణలో సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే పవన్ కల్యాన్ పోషిస్తున్న పోలీసాఫీసర్ భీమ్లా నాయక్ లుక్ కు మంచి స్పందన వస్తోంది. ఈ ప్రాజెక్టులో తాజాగా ప్రముఖ బాలీవుడ్ అండ్ సౌత్ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ జాయిన్ అయ్యారు. రవికే చంద్రన్ సెట్స్ లో త్రివిక్రమ్, సాగర్ చంద్ర, పవన్ తో కలిసి దిగిన ఫొటో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
రవి కే చంద్రన్ ఇప్పటికే మహేశ్ బాబుతో భరత్ అనే నేను చిత్రానికి పనిచేశాడు. తాజా మల్టీస్టారర్ ఆయనకు తెలుగులో రెండో సినిమా కాబోతుంది. ముందుగా ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ప్రసాద్ మూరెళ్ల పనిచేయాల్సింది. కానీ ఆయన స్థానంలో రవి కే చంద్రన్ జాయిన్ అయ్యారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.
Team #ProductionNo12 welcomes aboard the ace lensman who made a mark with his stellar frames, @dop007 to helm the camera work#BheemlaNayak PowerStar @PawanKalyan @RanaDaggubati #Trivikram @MusicThaman @saagar_chandrak @vamsi84 @NavinNooli pic.twitter.com/pHWg6AbzBE
— BA Raju's Team (@baraju_SuperHit) July 29, 2021
ఇవి కూడా చదవండి..
రూ.25 లక్షలు గెలుచుకున్న రాంచరణ్
‘రామారావు’తో వేణు గ్రాండ్ కమ్‌బ్యాక్
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ..గెహనా వశిష్ఠ్ పై కేసు
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..