Ravanasura | రవితేజ న్యూ లుక్‌తో రావణాసుర టీజర్ అప్డేట్
రవితేజ (Ravi Teja) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి రావణాసుర (Ravanasura). సుధీర్ వర్మ (Sudheer Varma) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ టీజర్ అప్డేట్ అందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త లుక్ విడుదల చేశారు మేకర్స్.
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి రావణాసుర (Ravanasura). సుధీర్ వర్మ (Sudheer Varma) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన రావణాసుర ఆంథెమ్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. తాజాగా మేకర్స్ రావణాసుర టీజర్ అప్డేట్ అందించారు. మార్చి 6న ఉదయం 10:08 గంటలకు రావణాసుర టీజర్‌ను లాంఛ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త లుక్ విడుదల చేశారు మేకర్స్.
రవితేజ కొంచెం సీరియస్ లుక్‌లో నడుచుకుంటూ వెళ్తున్న స్టిల్ క్యూరియాసిటీ పెంచుతోంది. రావణాసుర చిత్రంలో అనూ ఎమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ మూవీలో సుశాంత్ విలన్‌గా నటిస్తున్నాడు. రావణాసుర అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రావణాసుర చిత్రాన్ని 2023 ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు మరోసారి తాజా లుక్‌తో తెలియజేశారు. ఈ మూవీకి హర్షవర్దన్ రామేశ్వర్- భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. క్రాక్ సినిమాతో గ్రాండ్ సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన రవితేజ ధమాకా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు.
ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వర్ రావు షూటింగ్‌తో కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీతో బాలీవుడ్ నటి కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ హీరోయిన్గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది. డెబ్యూ డైరెక్టర్ వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
Villains are not bad, they are just real and true🔥
Witness the raw and unbridled power of #Ravanasura's teaser on March 6th at 10:08AM 🤙🏾🔥@RaviTeja_offl @iamSushanthA @sudheerkvarma #AbhishekPictures @RTTeamWorks #RavanasuraTeaser pic.twitter.com/Y51aCAkt6z
— ABHISHEK PICTURES (@AbhishekPicture) March 1, 2023
రావణాసుర ఆంథెమ్ లిరికల్ వీడియో సాంగ్..
రావణాసుర గ్లింప్స్ వీడియో..
Read Also :
Ponniyin Selvan 2 | పొన్నియన్ సెల్వన్ 2 వాయిదాపై మణిరత్నం టీం క్లారిటీ
Kamal Haasan | మా టీం రోజంతా కష్టపడుతోంది.. ఇండియన్ 2పై కమల్ హాసన్
Kavya Kalyanram | సిరిసిల్లకొస్తే మా అమ్మమ్మ ఊరికి వచ్చినట్టనిపిస్తది : కావ్యా కళ్యాణ్ రామ్
Naveen Polishetty | అనుష్కతో నవీన్ పొలిశెట్టి ఫన్ చిట్‌చాట్.. టైటిల్ అనౌన్స్ మెంట్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

