Kamal Haasan | మా టీం రోజంతా కష్టపడుతోంది.. ఇండియన్ 2పై కమల్ హాసన్
ప్రయోగాత్మక సినిమాలు చేయాలంటే కమల్ హాసన్ (Kamal Haasan) తర్వాతే ఎవరైనా అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar)తో ఇండియన్ 2 (Indian 2) చేస్తున్న విషయం తెలిసిందే. ఇండియన్ 2 ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ కమల్ హాసన్ (Kamal Haasan).. ప్రయోగాత్మక సినిమాలు చేయాలంటే కమల్ హాసన్ తర్వాతే ఎవరైనా అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మూవీ లవర్స్ కోసం ప్రయోగాలు చేసేందుకు ఎంతటి రిస్క్ అయినా తీసుకునేందుకు రెడీగా ఉంటాడు. ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar)తో ఇండియన్ 2 (Indian 2) చేస్తున్న విషయం తెలిసిందే.
ఇండియన్ 2 ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా ఈ సినిమా అప్డేట్ గురించి ఎదురుచూస్తున్న అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు కమల్ హాసన్. కమల్ హాసన్ మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ఇండియన్ 2ను త్వరగా పూర్తి చేసేందుకు మా టీం రాత్రి, పగలు తీవ్రంగా కష్టపడుతుందని చెప్పాడు. ఈ ఒక్క అప్డేట్తో ఇక ఇండియన్ 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిసిపోతుంది.
భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో మూవీలో కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇండియన్ 2 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే విడుదలైన ఇండియన్ 2 ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీతోపాటు అంచనాలు పెంచేస్తుంది. శంకర్ ఓ వైపు రాంచరణ్‌తో తెరకెక్కిస్తున్న ఆర్సీ 15 షూటింగ్ చేస్తూనే.. మరోవైపు ఇండియన్ 2తో బిజీగా ఉన్నాడు. కమల్ హాసన్ మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో 234వ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Read Also :
Ponniyin Selvan 2 | పొన్నియన్ సెల్వన్ 2 వాయిదాపై మణిరత్నం టీం క్లారిటీ
Kavya Kalyanram | సిరిసిల్లకొస్తే మా అమ్మమ్మ ఊరికి వచ్చినట్టనిపిస్తది : కావ్యా కళ్యాణ్ రామ్
Naveen Polishetty | అనుష్కతో నవీన్ పొలిశెట్టి ఫన్ చిట్‌చాట్.. టైటిల్ అనౌన్స్ మెంట్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

